మునుగోడు ఉప ఎన్నికల కౌటింగ్ కు సర్వం సిద్ధం

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక కౌటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.

నవంబర్ 6న ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.నల్గొండ పట్టణం అర్జాల భావిలోని వేర్ హౌసింగ్ గోడన్స్ లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కౌంటింగ్ కోసం మొత్తం 21 టేబుల్స్ ఏర్పాటు చేశారు.15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు.

ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ స్టేషన్ లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.

మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు.మొదటగా పోలింగ్ ఏజెంట్లు,అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేసి,పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు.

మునుగోడులో 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు.

ఒక్కో టేబుల్ కి కౌంటింగ్ సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్వైజర్,మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు.మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు విడుదల అవుతుంది.

చివరి రౌండ్ ఫలితం వంటి గంటకు విడుదల అవుతాయి.ఇలా 15 రౌండ్లలో 298 పోలింగ్ కేంద్రాల్లో పోలైన అన్ని ఓట్లు లెక్కిస్తారు.

ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు.మొదటగా చౌటుప్పల్ మండల ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమై నారాయణపురం,మునుగోడు,చండూర్,మర్రిగూడ,నాంపల్లి, గట్టుప్పల్ మండలాల వారిగా ఓట్లు లెక్కించనున్నారు.

కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి,ఆర్వో రోహిత్ సింగ్,కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగుతున్నది.

కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.స్ట్రాంగ్ రూమ్ వద్ద సి.

ఆర్.పి.

ఎఫ్ బలగాలతో,సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటల పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో 93.13% పోలింగ్ నమోదైంది.

కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకునేల అధికారులు అనుమతి ఇచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి26, ఆదివారం 2025