బెజవాడలో ఆ పార్టీలో అంతా గందరగోళం… ఎన్నికలకు ముందే ఇంత ఘోరంగా ? TeluguStop.com
కార్మిక పోరాటాలకు, ఉద్యమాలకు కేరాఫ్ బెజవాడ.ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ నగరం.
రాను రాను వారి చేతుల్లో నుంచి జారిపోయింది.ఒకప్పుడు సీపీఐ, సీపీఎంలు సంయుక్తంగా పోరు బాట పట్టి.
ప్రధాన పార్టీలకు సవాళ్లు రువ్వున ఈ నగరంలో ఇప్పుడు కమ్యూనిస్టులు మరొకరి సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
మరీ ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఎం ఒకింత ఫర్వాలేదనే రేంజ్‌లో ఉన్నా.
సీపీఐ పరిస్థితి దారుణంగా ఉంది.దశాబ్ద కాలం కిందటి వరకు అప్పటి 52 డివిజన్లలో 24 డివిజన్లలో సీపీఐ అభ్యర్థులు నిలబడితే.
మిగిలిన వాటిలో సీపీఎం పోటీ చేసిన పరిస్థితి ఉంది.మరి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కమ్యూనిస్టుల రాజకీయ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది.
సీపీఎం సుమారు 18 స్థానాల్లో పోటీ చేస్తోంది.అది కూడా ఎవరితోనూ పొత్తు లేకుండా .
ఒంటరిగానే బరిలో నిలిచింది.ఇక, సీపీఐ విషయానికి వస్తే.
కేవలం ఐదు స్థానాలకే పరిమితమైంది.అది కూడా టీడీపీతొ పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతోంది.
అంటే మొత్తానికి సీపీఐ పరిస్థితి మరింత గందరగోళంగా మారింది.సీపీఎం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నలుగురు నుంచి ఆరుగురు అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి.
ఇక, సీపీఐ విషయానికి వస్తే.ఒక్కచోట గెలిచినా.
ఎక్కువే అన్న విధంగా పరిస్థితి మారిపోయింది.పోరాటా ల పురిటి గడ్డలో ఈ పరిస్థితి ఏంటనేది కమ్యూనిస్టులను కలిచి వేస్తున్న ప్రధాన ప్రశ్న.
అయితే.ఆది నుం చి విజయవాడప్రజలు కమ్యూనిస్టులకు పట్టం కట్టినా.
రానురాను కమ్యూనిస్టులు తీసుకుంటున్న నిర్ణ యాలు.రాజకీయంగా వేస్తున్న అడుగులు, బలహీనపడుతున్న ప్రజా ఉద్యమాలు.
నేతల్లో సన్నగిల్లుతు న్న పోరాట పటిమ వంటివి ప్రధానంగా ఇక్కడ ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.
ఈ పరిణామాల కారణంగానే .పోరు గడ్డపై ఉనికిని చాటుకునేందుకు కామ్రేడ్లు కుస్తీ పడుతున్నారని అంటున్నారు పరిశీలకులు.
మరి ఈ ఎన్నికల్లో వారి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.