ఆ రెండు స్థానాలపైనే అందరి గురి ?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయలు హీటెక్కుతున్నాయి.నియోజిక వర్గాల వారీగా బలా బలహీనతలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి.

బలంగా ఉన్న సీట్లతో పాటు బలహీనతగా ఉన్న సీట్లను కూడా సొంతం చేసుకోవాలని కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి.

అయితే రెండు నియోజిక వర్గాల విషయంలో మాత్రం ఏ పార్టీ కూడా ఓ అంచనకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

అవే దుబ్బాక మరియు మునుగోడు.ఏ రెండు నియోజికవర్గల ప్రజలు ఎప్పటికప్పుడు విభిన్నమైన తీర్పునిస్తూ వస్తున్నారు.

దుబ్బాకలో ఇప్పటివరకు ఐదు సార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు టీడీపీ, నాలుగు సార్లు బి‌ఆర్‌ఎస్ ( టి‌ఆర్‌ఎస్ ) పార్టీలు గెలిచాయి.

రామలింగారెడ్డి మరణం తరువాత జరిగిన బైఎలక్షన్స్ లో బీజేపీ నుంచి రఘునందన్( Raghunandan Rao ) గెలుపొందారు.

"""/" / దాంతో ఈసారి దుబ్బాకలో గెలుపెవరిది అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఈ స్థానంలో అధికార బి‌ఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి ( Kotha Prabhakar Reddy )బరిలో ఉన్నారు.

బీజేపీ నుంచి మళ్ళీ రఘునందన్ బరిలో నిలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఇక మునుగోడు విషయానికొస్తే మొదటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ బలం ఎక్కువగానే ఉంది.

అలాగే వామపక్షాలు కూడా ఇక్కడ సత్తా చాటుతున్నాయి.అయితే మొదట కాంగ్రెస్ లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

"""/" / ఆ తరువాత జరిగిన బై ఎలక్షన్స్ లో బి‌ఆర్‌ఎస్ కు చెందిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ( Kusukuntla Prabhakar Reddy )గెలుపొందారు.

ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగబోతున్నారు.అయితే బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) రేస్ లో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఈ నియోజిక వర్గంపై ప్రస్తుతం హస్తం పార్టీ కన్ఫ్యూజన్ లో ఉంది.

ఎందుకంటే వామపక్షలతో పొత్తు పొత్తు పెట్టుకుంటే ఈ సీటు త్యాగం చేయాల్సి ఉంటుంది.

దాంతో ప్రస్తుతం ముడుగోడు విషయంలో కాంగ్రెస్ సీటు హోల్డ్ లో ఉందనే చెప్పాలి.

మరి ఈ రెండు నియోజిక వర్గాల ప్రజల తీర్పు ఎప్పటికప్పుడు విభిన్నంగానే ఉంటుంది.

కాబట్టి ఈసారి ఎవరు విజయం సాధిస్తాయో చూడాలి.

వైరల్ వీడియో: కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్‌లో సందడి చేసిన రియల్ హీరో..