ప్రజాపాలనను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి:నాంపల్లి జెడ్పీటీసీ ఏవి రెడ్డి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీల ప్రజాపాలనను అర్హులైన ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నాంపల్లి మండల జెడ్పీటిసి ఏవి రెడ్డి( ZPTC AV Reddy ) అన్నారు.
గురువారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పసునూరు,నామ నాయక్ తండా,వడ్డేపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకే ప్రభుత్వ ఫలాలు అందే విధంగా చూసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక తహసిల్దార్ దేవసింగ్,మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కే.అబ్బాస్, స్థానిక సర్పంచ్ లు,వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వీడియో వైరల్: భార్య దెబ్బకు ఉద్యోగం కోల్పోయిన పోలీసు కానిస్టేబుల్