సినిమా హాల్స్ లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలి… పవన్ కళ్యాణ్

10 లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాలపనను గౌరవిస్తూ నిలబడ్డారు.అవినీతి,దౌర్జన్యంతో నేడు దేశంలో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు.

ఈ దోపిడీ,అవినీతికి అడ్డుకట్ట వేయాలి.2024 ఎన్నికల తరువాత మన ప్రభుత్వం వచ్చాక గాంధీ జయంతిని బందరులో‌ చేసుకుందాం.

గాంధీజీకి, అంబేద్కర్ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి.వారు మన సిఎం లాగా కాకుండా బాధ్యతతో ఆలోచించారు.

Em>జగన్ లాగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన వారు చేయలేదు.రాజకీయాల్లో అభిప్రాయ బేధాలు ఉండటం సహజం.

అంబేద్కర్ మేధస్సును గుర్తించి గాంధీజీ అవకాశం ఇచ్చారు.దేశ అవసరాల కోసం ఎవరితో అయినా కలిసే స్వేచ్ఛ ఉంది.

జగన్ పై నాకు వ్యక్తిగత ద్వేషం లేదు.జగన్ ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించా.

గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం చంపేసింది.గాంధీ చూపిన అహంస మార్గంలో వెళదామన్నా ఇప్పుడు నాయకులతో సాధ్యం కాదు.

మన సమకాలీన రాజకీయ నాయకులకు బ్రిటిష్ వాళ్లకు ఉన్న సంయమనం లేదు.మన నాయకుల కన్నా బ్రిటిష్ వారే కొంచెం ఆలోచించే వాళ్లు.

అందుకే ప్రజల కోసం,రాష్ట్ర హితం కోసం కలిసి పోరాడాలి.వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని‌చేయాలి.

బురదలో నుంచి కమలం వచ్చినట్లు.కలుషితమైన రాజకీయాల్లో నుంచి జనసేన కమలం వికసిస్తుంది.

రాజకీయాల్లో బురద పడుతుందని తెలుసు.అయినా ముందుకే సాగుతాం.

పుష్ప సినిమాని రిజెక్ట్ చేసిన ఆరుగురు యాక్టర్లు.. ఎవరంటే..?