ప్రతి ఒక్కరు వ్యక్తిత్వ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: అన్నెపర్తి సుధీర్ కుమార్

సూర్యాపేట జిల్లా: ప్రతి ఒక్కరు వ్యక్తిత్వ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అన్నెపర్తి సుధీర్ కుమార్ అన్నారు.

జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో వ్యక్తిత్వ వికాసం విద్యార్థుల సందేహాలు, సమాధానాలు అనే అంశంపై ఆదివారం సాయంత్రం జరిగిన సెమినార్ కు ఆయన ముఖ్యాతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక సమాజంలో నెగిటివ్ దృక్పథాన్ని వదిలి పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

విద్యార్థులు దీర్ఘ కాలిక,స్వల్ఫ కాలిక లక్ష్యాన్ని ఏర్పరచుకొని సాకారం సఫలమయ్యే విధంగా కృషి చేయాలని అన్నారు.

టీవీ, చరవాణిల కి పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలని, బద్దకాన్ని వీడినట్లయితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్ఛని చెప్పారు.

వేకువ జామున మేల్కోంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని అభిప్రాయపడ్డారు.సమయం ఎంతో విలువైనదని దానిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

పాఠశాలలో విద్యార్థులు ఏకాగ్రతకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఒక్క పోస్టుతో మరోసారి దొరికిపోయిన రష్మిక విజయ్ దేవరకొండ.. కలిసే ఆ పని చేశారా?