పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి – ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ లలో,డిఎస్పీ కార్యాలయాల్లో హోమ్ గార్డు నుండి పై స్థాయి అధికారి వరకు తెలంగాణ హరితోత్సవం బాగస్వాములై మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి పౌరుడు మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని నాటిన మొక్కల పరిరక్షణకు పగడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పారు.

చెట్లను పెంచడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు మంచి కాలుష్యరహిత సమాజాన్ని అందించగలుగుతామని, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే హరితహారం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి కాలుష్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు.

రాబోయే తరాల ఆరోగ్యకరమైన భవిష్యత్ ను ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచుకొని హరిత హారం కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ హరితహారంలో తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని, హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో దాదాపు గా 6.

5 శాతం అడవుల పెంపకాన్ని పెంపొందించుకోవడం జరిగిందని అన్నారు.ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.

ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, రవికుమార్,సి.

ఐ లు అనిల్ కుమార్, ఉపేందర్,కృష్ణ కుమార్, బన్సీలాల్, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

భారీ అంచనాలతో వచ్చిన రాయన్ ప్లాప్ అయింది.. మరి ధనుష్ పరిస్థితి ఏంటి..?