సీ ఈ ఐ ఆర్ పోర్టల్ గురించి ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి – వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను సీఈఐఆర్( CEIR Portal ) ద్వారా కనుక్కొని, బాధితులకు తిరిగి అప్పగించిన వేములవాడ రూరల్ పోలీసులు.

ఈ సందర్బంగా ఎస్ ఐ మారుతీ( SI Maruti ) మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయినట్టు అయితే సీ ఈ ఐ ఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) లో పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఫోన్ ( Phone )దొరికిన వ్యక్తి దానిలో సిమ్ కార్డు వేసుకోవడంతో, ఈ వెబ్సైట్ ద్వారా అతని వివరాలతో కూడిన సమాచారం రాగానే ఫోన్ దొరికిన వ్యక్తి నుంచి ఫోన్ను స్వాధీనం చేసుకుని, పోగొట్టుకున్న వ్యక్తి కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.

సీ ఈ ఐ ఆర్ ద్వారా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మణ్ నాయక్, స్థంభంపల్లి చెందిన మహేష్ కి తన ఫోన్ అందించటం జరిగింది అని తెలిపారు.

బాధితులు వేములవాడ రూరల్ పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

జాకీచాన్-ప్రభాస్, బన్నీ-చెర్రీ లాంటి మల్టీస్టారర్స్‌ ప్లాన్ చేశారు.. కానీ..??