కాంగ్రెస్ లో అందరూ పీసీసీలే... కోమటి రెడ్డి వెంకట రెడ్డి సెటైర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ ఒకప్పుడు అత్యంత బలమైన పార్టీగా వెలుగొందుతూ వచ్చినా స్వయంకృతాపరాధం కారణంగా ప్రభుత్వ వైఫల్యాలపై కావచ్చు లేక ప్రజల సమస్యలపై పోరాడటంలో కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది.

అందుకే గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు వ్యతిరేక ఫలితాలు వచ్చిన పరిస్థితి ఉంది.

దీంతో పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించిన విషయం తెలిసిందే.

ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసినవే.అయితే తాజాగా వరి దీక్ష సందర్భంగా ఉప్పు నిప్పులా ఉన్న కోమటి రెడ్డి వెంకట రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి ఐక్యరాగం వినిపించారు.

అయితే ఈ సందర్భంగా కోమటి రెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయని చెప్పవచ్చు.

అయితే కాంగ్రెస్ లో అంతర్గత పోరు ముగిసిపోయిందనే ప్రచారం నేపథ్యంలో కోమటిరెడ్డి తన స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ లో అందరూ పీసీసీలే నని అందరూ ఇక్కడ సీనియర్ లే నని అనడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది.

అయితే ఇంకా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కోమటిరెడ్డి అంగీకరించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

"""/"/ అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలెవరూ పెద్దగా స్పందించలేదు.పైకి ఇలా ఐక్యరాగం వినిపించినా ఇంకా మనస్పర్థలు తొలగిపోనట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా కాంగ్రెస్ కు ఇది కీలకమైన సమయం కావున అందరూ ఒక్కటిగా పోరాడితేనే గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది.

మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.

సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి..!!