ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతి పక్షాలు తప్పుడు గా ప్రచారం చేస్తున్నారు....వైవి సుబ్బారెడ్డి

పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం కు ముఖ్యఅతిథిగా హాజరైన టీటీడీ చైర్మన్, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయం ,వాలంటీర్ల వ్యవస్థ ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతి పక్షాలు తప్పుడు గా ప్రచారం చేస్తున్నారన్నారు.

దృస్ ప్రచారం చెస్స్తున్న పచ్చ మీడియా ను తిప్పికొట్టాలని నాయకులు , కార్యకర్తల కు సూచించారు.

ప్రతీ ఇంటికీ ఇస్తున్న సంక్షేమ పథకాలు నిర్వహణ కొరకు ప్రతీ గ్రామ సచివాలయం కు ముగ్గురు కన్వీనర్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

వాలంటీర్ల తో సమన్వయం తో ఉండేలా గృహ సారదులు ఇద్దరిని ఏర్పాటు చెస్స్తున్నారన్నారు.

ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని వీరందరూ చూస్తారన్నారు.

చంద్రబాబు ,పవన్ లు చేస్తున్న దుష్ట ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు అని ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలంటే రానున్న 2024 లో జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలన్నారు.

గ్రామ వాలంటీర్ల కు ,కార్యకర్తలకు,వై.సి.

పి పార్టీ కి కష్ట బడ్డ వారికి కచ్చితంగా గుర్తింపు వచ్చేలా వారికి సముచిత న్యాయం జరిగేలా చూస్తామన్నారు.

అంతకుముందు రోడ్డు రవాణా శాఖ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ చంద్ర బాబు ,పవన్ భేటీ కి కారణం ముఖ్యమంత్రి వై.

ఎస్.జగన్మోహన్ రెడ్డి బలంగా ఉండటమే నని జగన్ ని ఢీకొట్టాలంటే ప్యాకేజి పెంచాలని అడగడానికే ప్రతిపక్షాలు కలుస్తున్నాయన్నారు.

పాయకరావుపేట బహిరంగ సమావేశం లో విశిష్ట అతిథిగా రోడ్డు రవాణా శాఖా మంత్రి దాడిశెట్టి రాజా,అతిధులుగా పాల్గొన్న పాయకరావుపేట సమన్వయ కర్త చింతలపూడి వెంకట రామయ్య ,అనకాపల్లి ఎం.

పి బీశెట్టి సత్యవతి ,ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్ లు హాజరయ్యారు.

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ప్యారడైజ్ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా..?