రాష్ట్రంలో పండిన ప్రతి ధాన్యపు గింజ కేంద్రం కొనుగోలు చేయాల్సిందే :-జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
TeluguStop.com
తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ రోజు ఖమ్మం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చౌక్ నందు జరుగుతున్న TRS పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్షలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయానికి పెద్దపీట వేశారని పంటలు బాగా పండి రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని అలాంటి సమయంలో రాష్ట్రంపై వివక్షత చూపిస్తూ ఆరుగాలం కష్టించి రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు పెట్టడం దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు.
మొత్తం వరి ధాన్యాన్ని FCI ద్వారా కొనుగోలు చెయ్యాలిసిన బాధ్యత కేంద్రం పై ఉందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పండిన ప్రతి గింజ కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే విధానం తో బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూ రైతుల పట్ల వివక్షత చూపిస్తే భవిష్యత్ లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గంలో ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర రూరల్ & టౌన్ ,ఎర్రుపాలెం మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, రైతులు, రైతు నాయకులు, నాయకులు పాల్గొన్నారు.
అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?