సూర్యాపేట జిల్లా:వచ్చే ఖరీఫ్ కాలం సందర్భంగా తమకున్న వ్యవసాయ భూమిలో ప్రతి రైతు కూడా ఒక అర ఎకరం భూమిలో( Half An Acre ) ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ జర్నలిస్టు,వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య( Molguri Gopaiah ) అన్నారు.
గురువారం మండల పరిధిలోని జగన్నాధపురం, నరసింహులగూడెం, రేపాల,విజయరాగపురం తాడ్వాయి,కలకోవ, మునగాల,బరాఖత్ గూడెం,ఆకుపాముల గ్రామాలలో స్వచ్ఛందంగా నిర్వహించిన ప్రకృతి వ్యవసాయంపై రైతు చైతన్య యాత్రలో ఆయనపాల్గొని మాట్లాడుతూ.
వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని, రోజురోజుకు రసాయనాలు వినియోగం బాగా పెరిగి,భూసారం దెబ్బతింటుందన్నారు.
</br<
మనం తినే ఆహారం పూర్తిగా కలుషితమైందని, అలాగే గాలి,నీరు కూడా కలుషితమైందని,దీంతో షుగర్,బిపి,కిడ్నీ జబ్బులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వ్యాపిస్తున్నాయన్నారు.
కాబట్టి ప్రతి రైతు కూడా తమ కుటుంబ అవసరాల కోసం ఒక అర ఎకరంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయాలని కోరారు.
మనకు అందుబాటులో ఉన్న సహజ వనరులతో ప్రకృతి వ్యవసాయం( Organic Farming ) పితామహుడు డాక్టర్ సుభాష్ పాలేకర్ పద్ధతులను పాటించి, మనతోపాటు భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలనిసూచించారు.
వ్యవసాయ భూమి లేని వారు తమ ఇళ్లల్లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలను సాగు చేసుకోవాలన్నారు.
ఆ సినిమాలో గెస్ట్ రోల్ ను రిజెక్ట్ చేసిన బాలకృష్ణ.. అసలేం జరిగిందంటే?