ప్రతిరోజు నాన్న వారికి 100 ఉత్తరాలు రాసేవారు.. ఎమోషనల్ అయిన బిగ్ బీ!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సినీ కెరియర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఈయనకు 80 సంవత్సరాలు వయసు దాటినప్పటికీ ఇంకా సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఇలా వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా మరోవైపు కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమం 14వ సీజన్ ప్రసారమవుతుంది.తాజాగా రియాలిటీ షోలో పోస్టల్ ఉద్యోగి జ్యోతిర్మయితో మాట్లాడే సందర్భంలో అమితాబ్ తన తండ్రి హరివంశ్ రాయ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరో కంటెంట్ తమ వద్ద అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ రాసిన లెటర్స్ ఉన్నాయని చెప్పారు.

ఈ క్రమంలోని గతంలో తన తండ్రి అభిమానుల కోసం ప్రత్యేకంగా ఉత్తరాలు రాసి పంపేవారు అంటూ తన తండ్రి గురించి మాట్లాడారు.

"""/"/ ఇలా తన తండ్రి రోజుకు 100 ఉత్తరాలు రాస్తూ తానే స్వయంగా పోస్ట్ చేసే వారని ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తన తండ్రి గురించి వెల్లడించారు.

లెటర్స్ పోస్ట్ చేసిన మరోసారి వెళ్లి ఆ లెటర్స్ పంపించారో లేదో చెక్ చేసుకునేవారు.

ఇలా తన తండ్రి అభిమానులకు ప్రత్యేకంగా ఉత్తరాలు రాసేవారని ఈ సందర్భంగా తన తండ్రిని తలచుకొని ఎమోషనల్ అయ్యారు.

అయితే ఎవరి దగ్గర అయితే తన తండ్రి రాసిన ఉత్తరాలు ఉన్నాయో వారు తనకి వాటిని పంపించాలని ఈ సందర్భంగా అమితాబ్ కోరారు.

అయితే ఆ లెటర్ ఒక జిరాక్స్ కాపీ అభిమానులకి ఇస్తామని అమితాబ్ తెలియజేశారు.

ఇండియన్స్‌, అమెరికన్స్ ఆహారపు అలవాట్లు ఎంత భిన్నంగా ఉంటాయో తెలుసా..?