ఆర్థికమాంద్యం అంచుల్లో చైనా… 6 నెలల్లో ఏకంగా రూ. 57వేల కోట్ల నష్టం?
TeluguStop.com
ప్రపంచ వ్యాప్తంగా అనేకదేశాల్లో ద్రవ్యోల్బణం ప్రభావం చాలా ఎక్కువగా కొనసాగుతోంది.ఇక ద్రవ్యోల్బణం కారణంగా అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడుతుండగా.
మరికొన్ని కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి.ఇక ఆర్థిక రంగంలో బలంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు దేశమైన చైనాలో( China ) కూడా ద్రవ్యోల్బణం ప్రభావం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆ దేశానికి చెందిన రియల్ ఎస్టేట్ రంగంలో( Real Estate ) కొనసాగుతున్న ఒక సంస్థ సుమారు రూ.
6 లక్షల కోట్లకు పైగా నష్టాలు చవి చూడగా.తాజాగా మరొక సంస్థ కూడా అదే బాటలో కొనసాగుతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
"""/" /
గడచిన 6 నెలల్లో ఆ సంస్థ సుమారు సుమారు రూ.
57 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయిందని అక్కడి పత్రికలు వెల్లడించాయి.చైనాలో ప్రతి ద్ర్యోల్బణం కారణంగా తాజాగా ధరల పతనం కూడా కొనసాగుతోందని ఆమధ్య ప్రకటించిన సంగతి విదితమే.
దేశంలో ఎగుమతులు గణనీయంగా పడిపోవడంతో నిరుద్యోగం ( Unemployment ) రికార్డు స్థాయికి చేరింది.
దేశ ఎగుమతులు జులైలో 14.5శాతం పడిపోగా.
దానికి తోడు కొత్తగా 11.58 మిలియన్ల మంది గ్రాడ్యూయేట్లు ఉద్యోగాల కోసం ఎదురు పడిగాపులు కాస్తున్నారు.
చైనాలోనూ ద్రవ్యోల్బణం అడుపెట్టడంతో చాలా సంస్థలకు ఇపుడు శాపంగా మారింది. """/" /
అవును, ద్రవ్యోల్బణం దెబ్బతో ఆ దేశంలో స్థిరాస్తి రంగం కోలుకోలేకపోతోంది.
తాజాగా రియస్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న 'ఎవర్‌గ్రాండే'( Evergrande ) సంస్థ సుమారు రూ.
6 లక్షల కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది.చైనాలో ప్రాపర్టీ డెవలపర్‌గా పేరున్న 'కంట్రీ గార్డెన్'( Country Garden ) సంస్థ ఈ ఏడాది తొలి 6 నెలల్లో 7.
6 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.57 వేల కోట్లు నష్టాన్ని చూడవచ్చని సంస్థ ప్రకటించింది.
కంట్రీ గార్డెన్ వంటి సంస్థకే ఇటువంటి పరిస్థితి దాపురిస్తే.చైనాలో ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఏ మేరకు ప్రభావం చూపుతుందో ఇక అర్థం చేసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి పూనమ్ కౌర్.. అసలేం జరిగిందంటే?