ఎప్పుడైనా ఆలోచించారా.. రైలు పట్టాలు ఎందుకు తుప్పు పట్టకపోవడానికి కారణాలు..?!

సాధారణంగా ఇనుముతో తయారు చేసిన ఏ వస్తువైనా తుప్పు పడుతూ ఉంటాయి.తడిగా ఉన్నా, గాలిలో ఆక్సిజన్ తో ప్రతి స్పందించినప్పుడు లేదా తడిగా ఉన్నప్పుడు ఇనుము పై గోధుమ రంగులో ఐరన్ ఆక్సైడ్ నిక్షిప్తం అవుతుంది.

ఈ గోధుమ రంగు పూత ఇనుము, ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపి ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది.

గాలిలోని తేమ కారణంగా ఐరన్ తో చేసిన వస్తువులు తుప్పు పడుతూ ఉంటాయి.

అయితే రైళ్ల పట్టాలు కూడా ఇనుము తోనే చేసినవి కదా.మరి అవి ఎందుకు తుప్పు పట్టవన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే.

సుదూర ప్రయాణాలు చేసేందుకు చాలా మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు.ఎంత దూరం ప్రయాణం చేసిన రైలు ట్రాక్ పై ఏ మాత్రం కదులుతున్నట్టు అనిపించదు.

అయినా రైలు పట్టాలు ఇనుముతో చేసినప్పుడు తుప్ప పట్టాలి కదా.ఒక వేళ రైల్వే ట్రాక్ తుప్పు పడితే చాలా ప్రమాదాలు జరుగుతాయి.

అలా జరగడం వల్ల తరుచూ రైలు పట్టాలు సరిచేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.

మరి ఎందుకు అలా జరగదో చాలా మంది ఇలాంటి విషయాలు తెలియక అనుమానాలు వస్తుంటాయి.

అయితే రైలు పట్టాలు తుప్పు పట్టకపోవడానికి కారణం రైల్వే ట్రాక్ తయారీకి అధిక నాణ్యత గల ఉక్కును ఉపయోగిస్తారు కాబట్టి.

ఈ ఉక్కులో 1% కార్బన్, 12% మాంగనీస్ కలిసి ఉంటుంది.అందుకే దీన్ని ' సీ-ఎం ఎన్ ' రైల్ స్టీల్ అని పిలుస్తారు.

ఒక వేళ ట్రాక్ తుప్పు పట్టినా సంవత్సరానికి 0.05 మి.

మీ ఉంటుందట.అంటే 1 మి.

మీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుందట.పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూ ఉంటుంది.

కాబట్టి రైలు చక్రాల ఒత్తిడి కారణంగా పట్టాలు ఎప్పుడూ పాలిష్ చేసిన విధంగా ఉంటాయి.

ఒకవేళ పట్టాలు ఏ మాత్రం తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలు మార్చేస్తూ ఉంటారని, రైలు పట్టాలు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ కూడా వేస్తారని నిపుణులు చెబుతున్నారు.

బీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్..!!