ఇడ్లీ ATMని ఎపుడైనా చూశారా? స్కాన్ చేయగానే వేడి వేడి ఇడ్లీలు వచ్చేస్తాయి!
TeluguStop.com
సోషల్ మీడియా పరిధి బాగా పెరగడంతో అన్ని రకాల విషయాలు ఇట్టే తెలిసిపోతున్నాయి.
నేటి పరిస్థితులలో స్మార్ట్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికీ అత్యవసరం అయిపోయింది.దాంతో సోషల్ మీడియా వినియోగం సహజంగానే పెరిగిపోయింది.
ఈ క్రమంలో అనేకరకాల వీడియోలు ఇక్కడ తెగ వైరల్ అవుతున్నాయి.అందులో కొన్ని ఆహుతులను అలరిస్తున్నాయి.
కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటున్నాయి, ఇంకొన్ని అద్భుతం అనిపిస్తాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు నోళ్లెళ్లబెడుతున్నారు.
విషయంలోకి వెళితే, భారత ఐటీగా పిలవబడే బెంగళూరు ఎన్నో స్టార్ట్ అప్ లకు నెలవు అన్న సంగతి తెలిసినదే.
ఈ క్రమంలో అక్కడ ఒక చోట ఏర్పాటు చేసిన ఇడ్లీ ATM ఇప్పుడు సర్వదా చర్చనీయాంశమైంది.
ఇది చాలా ప్రత్యేకంగా కనబడటంతో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.B పద్మనాభన్ అనే వ్యక్తి షేర్ చేసిన వీడియోలో ఇడ్లీ ATM ఎలా పని చేస్తుందో ఓ మహిళ కూలంకషంగా వివరిస్తుంది.
ఫ్రెషాట్ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఇడ్లీ ATM ఔట్ లెట్ ను చూపించడంతో ఈ వీడియో ప్రారంభం అవుతుంది చూడండి.
"""/"/
ఆతరువాత లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ మనకి క్యూఆర్ కోడ్ తో ఆర్డర్ ఎలా చేయాలో చెబుతోంది.
కేవలం ఒకే ఒక్క నిమిషం సమయం వ్యవధిలోనే ఇడ్లీ తయారవుతుందని మనకి తెలుస్తోంది.
ఆఖరిగా ఆకర్షణీయంగా డిజైన్ చేసిన డబ్బాలో పార్సిల్ బయటికి వస్తోంది చూడండి.రుచి విషయానికొస్తే అమోఘంగా ఉందని కూడా తెలుస్తోది.
కాగా నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవ్వగా.ఇడ్లీ ATMపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవ్వడం కొసమెరుపు.
కొంతమంది ఈ సాంకేతికతను చూసి ఖిన్నులైతే, మరికొందరు ఎక్స్ ట్రా చట్నీ పరిస్థితి ఏమిటి? అంటూ చమత్కరిస్తున్నారు.
వైరల్: జలుబు చేసిందని ఇంగ్లీషులో యజమానికి చెబుతున్న చిలుక!