ఊసరవెల్లిలా రంగులు మార్చే కారుని ఎపుడైనా చూసారా? ఇక్కడ చూడండి!

అవును, మీరు విన్నది నిజమే.ఓ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చేయగలదు.

కాలంతో పాటు ఆటో మొబైల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది.కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు వివిధ కంపెనీలు వాహనాలను రూపొందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ అయినటువంటి BMW ఒక బటన్ నొక్కితే కలర్ ను మార్చే కారుని ప్రవేశపెట్టింది.

ఇక ఈ కార్ స్పెషాలిటీ ఏంటి అంటే దాని రంగును మార్చగలదు.దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ సోషల్ మీడియాలో తాజాగా వెల్లడించడంతో అది కాస్త వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం ట్వీట్ చేస్తూ ఒక బటన్‌ను నొక్కితే చాలు కారు రంగును మార్చేయవచ్చని తెలిపింది.

E ఇంక్‌తో కూడిన BMW Ix ఫ్లో తక్షణం రంగులను మార్చగలదు.అయితే ప్రస్తుతానికి, కారు గురించి మాత్రం పూర్తిగా సమాచారం ఇవ్వలేదు.

కాగా కారును 3 రంగుల్లో మార్చుకోవచ్చు.ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా కారు రంగును తెలుపు నుండి నలుపుకు మార్చవచ్చు.

అంతేకాకుండా, నలుపు రంగును బూడిద రంగులోకి కూడా మార్చవచ్చు. """/"/ కంపెనీ ఇస్తున్న సమాచారం ప్రకారం, ఈ ప్రక్రియ అనేది ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా జరగుతుందని తెలుస్తోంది.

దీనిని "ఎలెక్ట్రోఫోరేటిక్ టెక్నిక్" అంటారు.కంపెనీ గ్రూప్ డిజైన్ హెడ్ అడ్రియన్ వాన్నెస్ మాట్లాడుతూ BMW Ix ఫ్లో అనేది ఒక అడ్వాన్స్డ్ రీసర్చ్ అండ్ డిజైన్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు.

అలాగే BMW ఫార్వర్డ్-థింకింగ్‌కు గొప్ప ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా అన్నారు.

ఇకపోతే వేసవిలో కారు రంగును తెల్లగా మార్చుకోవచ్చు.దీని వల్ల తెలుపు రంగు సూర్యుని వేడిని గ్రహించదు కాబట్టి కారు తక్కువ వేడెక్కుతుంది.

తద్వారా ఎక్కువగా మన్నుతుంది.అలాగే చలికాలంలో కార్ కలర్ బ్లాక్ కలర్ లోకి మార్చడం వల్ల సూర్యుని వేడిని గ్రహిస్తుంది.

ఈ కారణంగా కారు త్వరగా వేడెక్కుతుంది అని వివరించారు.

హమ్మయ్య .. మొత్తానికి దివాళీ ఎపిసోడ్ తో చిందులు వేయించారు