నామినేషన్ ల తంతు ముగిసినా … బీజేపీ లో టికెట్ల లొల్లి
TeluguStop.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ ల ప్రక్రియ నిన్నటితో ముగిసినా, బిజెపి( BJP )లో మాత్రం ఇంకా టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది.
నామినేషన్ల చివరి రోజున కొంతమంది అభ్యర్థులను మార్చి వేరే వారికి బి ఫామ్ ఇవ్వడంపై పార్టీ ప్రకటించిన అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి గురవడమే కాకుండా, అధిష్టానానికి హెచ్చరికలు కూడా చేస్తున్న తీరు బిజెపిలో ఆందోళన కలిగిస్తుంది.
శుక్రవారం ప్రకటించిన 14 మంది అభ్యర్థుల జాబితా అంతా వివాదాస్పదం కావడంతో, బిజెపిలో గందరగోళం నెలకొంది.
వేములవాడలో తులా ఉమకు బదులుగా వికాస్ రావుకు , సంగారెడ్డిలో రాజేశ్వర్ దేశ్ పాండేకి( Rajeshwar Deshpande ) బదులు పులిమామిడి రాజుకు బీ ఫామ్ లు ఇవ్వడంపై తులా ఉమా, దేశ్ పాండే లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలుస్తామని నిన్న హెచ్చరికలు చేశారు .దీంతో వారిని బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది.
వేములవాడలో బీసీ మహిళ తుల ఉమకు టికెట్ ఇప్పించేందుకు ఈటెల రాజేందర్ గట్టిగానే ప్రయత్నాలు చేశారు.
"""/" /
ఆమెకు సీటు కేటాయించకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయనని అధిష్టానానికి హెచ్చరికలు కూడా చేశారు.
దీంతో తుల ఉమ ను అభ్యర్థిగా ప్రకటించింది.కానీ చివరి నిమిషంలో ఆమెకు బీఫామ్ ఇవ్వకుండా , మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు బీఫామ్ ఇచ్చింది.
ఇక సంగారెడ్డిలో పులిమామిడి రాజుకు కూడా సీటు కేటాయించాలని ఈటెల రాజేందర్ అధిష్టానంకు విజ్ఞప్తి చేయగా , ఏదో ఒక సీటు ఎంపిక చేసుకోవాలని అధిష్టానం సూచించింది.
దీంతో గెలిచే అవకాశాలున్న సంగారెడ్డి వైపు ఈటెల రాజేందర్ మొగ్గు చూపించారు.అయితే తనను నామినేషన్ వేసుకోమని చెప్పి ,బి ఫామ్ ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్థాపానికి గురైన దేశ్ పాండే కిషన్ రెడ్డికి ఫోన్ చేసి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ హెచ్చరించిన వీడియో వైరల్ అయింది.
ఇక జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఎమాజీ పేరు ఉండగా శ్రీదేవిని , అలంపూర్ లో మారెమ్మ స్థానంలో రాజగోపాల్ ను బిజెపి ఖరారు చేయడం వివాదం కారణమైంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు చివరి నిమిషం వరకు కాంగ్రెస్ లో ఉండి బిజెపిలో చేరిన సాయి గణేష్ ( Sai Ganesh )కు కేటాయించడంపై కూడా పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.
ఇక్కడ మాజీ డిజిపి కృష్ణ ప్రసాద్ ను నామినేషన్ వేసుకునేందుకు సిద్ధం కావాలంటూ చెప్పిన బిజెపి , ఆయనను తప్పించి సాయి గణేష్ కు, అదేవిధంగా పోటీకి ఇష్టపడని మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుకు మల్కాజ్ గిరి సీటును కేటాయించడం మరో వివాదానికి కారణం అయింది.
"""/" /
మల్కాజ్ గిరి టికెట్ కోసం ఆకుల రాజేందర్, బీజేవైఎం అధ్యక్షుడు భాను ప్రకాష్ ( BJYM Bhanu Prakash )మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో వీరిద్దరికీ కాకుండా పోటీకి ఇష్టపడని రామచంద్రరావుకు బిజెపి అవకాశం ఇచ్చింది.
దీంతో భాను ప్రకాష్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.సేరి లింగంపల్లి టికెట్ ను రవికుమార్ యాదవ్ కు కేటాయించడంతో చాలా కాలంగా ఇక్కడే పని చేస్తూ ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న గజ్జల యోగానంద తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
కొడుకుకు నామకరణం చేసిన బిగ్ బాస్ మానస్.. ఏం పేరు పెట్టారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!