పట్టభద్రులు కూడా ఓటుకు అమ్ముడు పోతే ఇక ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో(MLC Elections) ప్రజాస్వామ్యం అపహస్యమయ్యే పరిణామాలు చాలా కనిపించాయి .

పెద్దల సభకు వెళ్లవలసిన వ్యక్తుల ప్రచారం.ఎన్నిక కూడా ఆ తరహా లోనే ఉండాలి.

కానీ సార్వత్రిక ఎన్నికల కంటే దారుణంగా కొన్ని పరిణామాలు చూసిన వారు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు .

మాకు నోట్లు అందలేదు కాబట్టి మేము ఓటేయమని ఇంట్లో కూర్చున్న జనాలు కొందరైతే, వాళ్లకు 2000 ఇచ్చారు మాకు వెయ్యి రూపాయలు మాత్రమే ఇచ్చారు అంటూ వీధికేకి గొడవ పడిన జనాలు మరికొందరు.

భాజపా నేత విష్ణువర్ధన్ రాజుగారైతే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ డబ్బులు ఇచ్చి అధికారపక్షం వివక్షను చూపిస్తుందంటూ ఆయన సెలవిచ్చారు.

అసలు నిలదీయాల్సింది ఓటుకు నోటు(Note For Vote) ఎందుకు ఇచ్చారని కదా?.ఇలాంటి చిత్రాలు ఎన్నికలలో చాలా చోటుచేసుకున్నాయి .

ఎన్నికల ప్రక్రియ నోట్ల పండుగగా మారిపోతుందని మేధావులు ఎప్పటినుంచో మొత్తుకుంటూనే ఉంటున్న కనీసం గౌరవప్రదంగా జరిగే ఇలాంటి ఎన్నికలు (Elections) కూడా ఈ స్థాయికి దిగజారిపోవడo చాలా బాధాకరమైన విషయం .

పార్టీలు కూడా గెలుపు ఓటములను పక్కనపెట్టి కొన్ని సంప్రదాయాలను పాటించడం అలవాటు చేసుకోవాలి.

లేకపోతే ఇది పూర్తిస్థాయి బెట్టింగ్ వ్యవహారాల లాగా మారిపోతుంది. """/" / అది ఎవరికి మంచిది కాదు ప్రజల సంరక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులతో పాటు ప్రజల మీద కూడా ఉంటుంది.

తాత్కాలికమైన అవసరాల కోసం తాయిలాల కోసం ఓట్లు అమ్ముకుంటూ మనల్ని మనం దిగజార్చుకుంటుంటే ఆ ఫలితం కూడా రేపు మనమే అనుభవించాల్సి ఉంటుంది.

మనకు నష్టం జరగట్లేదు కదా అనుకుంటూ కళ్ళు మూసుకుంటూ కూర్చుంటే రేపు నష్టం జరిగే రోజు వచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి ఏ వ్యవస్థ మిగలదు.

"""/" / కాస్తో కూస్తో అర్థవంతమైన చర్చలు జరిగేది రాజ్యసభ, శాసన మండలి లో మాత్రమే .

ప్రజా సమస్యలను కాస్త పట్టించుకునేది, మితిమీరిన అవినీతిని ప్రశ్నించేది ఈ సభలో ఎన్నికైన నేతలే.

మరి అలాంటి వాఋ ఎన్నికను కూడా డబ్బుతో ముడిపెట్టి చూస్తే ఇక విద్యావంతులు మేధావులు ఆ సభకు వెళ్లే మార్గాలు కూడా మూసుకుపోతాయని చెప్పాలి ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు .

ఈ ముగ్గురు దర్శకుల సినిమాలు అందుకే ప్రత్యేకంగా నిలుస్తున్నాయా..?