ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
TeluguStop.com
ఏపీలో ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయింది .
టిడిపి , జనసేన, బిజెపి కూటమి తరుపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని మోది ఏపీకి రానున్నారు.
ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో, ఏపీలో ప్రచారానికి సమయం కేటాయించలేకపోయారు .
దీనిపై అనేక అనుమానాలు కూటమి నేతల్లో వ్యక్తం అయ్యాయి.తమతో పొత్తు పెట్టుకున్నా.
బిజెపి అగ్ర నేతలు ఎవరు ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఆసక్తి చూపించకపోవడంపై ఒక దశలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోది ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు కావడంతో, కూటమి నేతల్లో ఆనందం కనిపిస్తోంది .
ఏపీలో నాలుగో విడత లో ఎన్నికలు జరగనుండడంతో, రెండు రోజులు పాటు ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని సమయాన్ని కేటాయించారు.
"""/" /
ఈనెల 6, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు.
ఈ సందర్భంగా రోడ్ షోలు , బహిరంగ సభల్లో ప్రధాని మోది తో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
మే 6న రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో బహిరంగ సభ నిర్వహిస్తారు .మే 8న పీలేరు అసెంబ్లీ పరిధిలో కలికిరి వద్ద బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.
ఆ తరువాత విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్దకు చేరుకుని బెంజి సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు.
అయితే ప్రధాని రెండు రోజుల పర్యటనలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తారా లేదా అని దానిపై కూటమి నేతల్లో సందేహం నెలకొంది.
"""/" /
గతంలో చిలకలూరిపేట జరిగిన సభలో నరేంద్ర మోది జగన్ పై పెద్దగా విమర్శలు చేయకపోవడంతో , ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయం కావడంతో , జగన్ ఆయన పాలనను టార్గెట్ చేసుకుని ప్రధాని విమర్శలు చేస్తే అది కూటమికి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
మరి ఈ విషయంలో ప్రధాని మోదీ వైఖరి ఎలా ఉండబోతోంది అనే దానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
నేను రోడ్డు షో చేయలేదు.. ఈ ఘటనలో నా తప్పులేదు: అల్లు అర్జున్