ఇన్ని తప్పులు జరిగాయని తెలిసినా… ఓటమి పై జగన్ సమీక్ష
TeluguStop.com
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి( YCP ) ఘోర ఓటమి చెందడానికి గల కారణాలు ఏమిటంటూ ఆ పార్టీ అధినేత జగన్( Jagan ) ఇప్పుడు ఆరా తీసే పనులుల్లో నిమగ్నం అయ్యారు .
ఈ మేరకు నిన్నటి నుంచి పార్టీ తరపున పోటీ చేసిన నేతలు , ఇతర ముఖ్య నాయకులతో జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు జనాలకు అందించినా, కేవలం 11 స్థానాలు మాత్రమే వైసిపి కి దక్కడం వెనుక తప్పెక్కడ జరిగిందనే విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకపక్క ఈవీఎంలలో మోసాలు జరిగాయనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూనే. ప్రజా తీర్పును గౌరవిస్తామని ప్రతిపక్షంలో ఉండడం తమకేమీ కొత్త కాదని, 2029 ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామనే ధీమా ను జగన్ వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం జగన్ సమీక్షలు నిర్వహిస్తూ ఓటమికి గల కారణాలను పార్టీ నాయకుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
"""/" /
అసలు ఈ తప్పిదాలకు కారణం జగన్ వైఖరి అన్నది సొంత పార్టీ నాయకులలోను జనాల్లోనూ కలుగుతున్న అభిప్రాయాలు.
ఎన్నికల్లో జగన్ పార్టీకి వచ్చిన ఓట్లను చూసినా, దాదాపు 1.30 కోట్ల ఓట్లు వచ్చాయి.
వీరంతా జగన్ పాలన అంటే ఇష్టపడి ఓటు వేసిన వారు, సంక్షేమాన్ని అందుకున్న వారు అయి ఉండవచ్చు.
మరో రకమైన ఓటర్లు కూడా కావచ్చు.కానీ వైసీపీ దారుణ ఓటమికి మాత్రం జనసేన, టిడిపి బిజెపి,( Janasena TDP BJP ) కలిసి పోటీ చేయడం ఒక్కటే కారణం కాదు .
ఇంకా అనేక కారణాలు వైసిపి ఓటమికి కారణాలు అయ్యాయి.ముఖ్యంగా తటస్థ ఓటర్లు ఈసారి వైసీపీకి ఓటు వేయకపోవడమూ కారణమే.
దీనికి గత వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు , నాయకుల స్టేట్మెంట్ లు కారణం.
పేదలకు , పెత్తందారులకు మధ్య యుద్ధం అంటూ అత్యుత్సాహంతో చేసిన స్టేట్మెంట్లు ఒక వర్గం ప్రజల్లో అసంతృప్తిని కలిగించాయి.
ముఖ్యంగా అగ్రవర్ణాలుగా పిలవబడుతున్న కొన్ని కులాలు పూర్తిగా వైసిపికి వ్యతిరేకం అయ్యాయి. """/" /
ఆర్థికంగా బలంగా ఉన్నవారు తాము చెల్లిస్తున్న పన్నుల సొమ్మును అప్పనంగా ప్రజలకు దోచిపెడుతున్నారని, అభివృద్ధి ఏపీలో కుంటిపడిందని బలంగా నమ్మడం మరో కారణం.
కొన్ని ప్రధాని కులాలు పూర్తిగా వైసిపికి వ్యతిరేకం అయ్యే విధంగా జగన్ తో పాటు, ఆ పార్టీ నాయకులు చేసిన కామెంట్స్ వారిని పూర్తిగా వైసిపికి దూరం చేశాయి.
ఇక మూడు రాజధానుల అంశం( Three Capitals ) సక్సెస్ కాకపోవడం, ఉద్యోగాల భర్తీ పెద్దగా చేపట్టకపోవడం, నోటిఫికేషన్ లు లేకపోవడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరగడం, రోడ్లు అధ్వానంగా ఉండడం ఇవన్నీ క్రమక్రమంగా వైసీపీ పై వతిరేకతను పెంచుతూనే వచ్చాయి.
ముఖ్యంగా వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ ను పెద్దగా పట్టించుకోకపోవడం, వాలంటీర్లకి( Volunteers ) ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం , గత ఎన్నికల సమయంలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు మొండి చూపించడంతో మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ కేడర్ కూడా అంత కసిగా పనిచేయలేదనే విషయం అర్థం అవుతోంది .
పార్టీ విజయం కోసం కృషి చేసినా, తమకు ఒరిగేదేమీ లేదన్న అభిప్రాయానికి కార్యకర్తలు రావడం వంటి ఎన్నెన్నో కారణాలు వైసీపీ ద్వారా ఓటమికి కారణాలు అయ్యాయి.
ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?