ప్రస్తుత సమాజంలోనీ వారికి రాముడు చెప్పే.. ఈ ఆర్థిక నియమాలు ఎంతో అవసరం..!

అయోధ్య( Ayodhya )లో రామాలయం ప్రారంభోత్సవంలో దేశమంతా ఆధ్యాత్మికతలో రామ నామా జపంలో మునిగిపోయింది.

ఈ సమయంలో రాముడు నుంచి నేర్చుకోవాల్సిన ఆర్థిక పాఠాలూ ముఖ్యమైనవనీ పండితులు చెబుతున్నారు.

ధర్మం పట్ల రాముడి నిబద్ధత దీర్ఘకాలంలో ఎలాంటి ఆర్థిక విజయాలను సాధించాడో గమనిస్తే రామాయణం, రాముడిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే రాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.అందుకే అన్నిటికి సిద్ధంగా ఉండాలి.

"""/" / అదే విధంగా వ్యక్తిగత ఫైనాన్స్ లో బాగా ఆలోచించదగిన, ఆర్థిక ప్రణాళికతో ఉండడం మంచిది.

ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్న బడ్జెట్( Budget ) ను రూపొందించుకున్న లేదా వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టిన ప్రణాళిక అనేది జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనేలా చేస్తుంది.

అలాగే రావణుడితో రాముడి యుద్ధం, ధైర్యం, రిస్క్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యతను తెలుపుతుంది.అదే విధంగా వ్యక్తిగత ఫైనాన్స్ లో సంపద సృష్టికి ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, రాబోయే నష్టాలను ఎదురుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

నష్టాలను అంచనా వేయడం, సమస్యలను నావిగేట్ చేయగల ధైర్యం ఆర్థిక నిపుణుల నుంచి మార్గదర్శకత్వం పొందడం ఆర్థిక విజయానికి దోహదం చేస్తాయి.

"""/" / ఇంకా చెప్పాలంటే సంపద సృష్టి కోసం ఏది పడితే అది ఫాలో కాకూడదు.

దీనికి రామాయణం లో సరైన ఉదాహరణ ఉంది.సీత మీద రావణుడి వ్యామోహం సీత వెంటపడి చివరికి ఏమయ్యాడో దాదాపు చాలా మందికి తెలుసు.

అలాగే కోరికలను అదుపులో పెట్టుకోవాలి.అధిక ఆర్థిక లాభాల కోసం పెట్టుబడులను వెంబడించకుండా జాగ్రత్తపడాలి.

ఆర్థిక సరిహద్దులను ఏర్పరుచుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే డబ్బును రెట్టింపు చేయడానికి, పొదుపు చేయడానికి, అధిక లాభాలు పొందడానికి చిట్కాలను అనుసరించడం కంటే మంచి పెట్టుబడి పద్ధతులను పాటించాలి.

ఇంకా చెప్పాలంటే లంకాధిపతి రావణుని( Ravan ) అహంభావం కారణంగా పతనం అయ్యాడు.

పెట్టుబడిదారులకు ఒక హెచ్చరిక కథగా ఇది ఉపయోగపడుతుంది.అహంకారంతో పనిచేయని ఆస్తులను పట్టుకొని వేలాడడం ఆర్థిక విజయానికి ఆటంకం కలిగిస్తుంది.

తప్పులను అంగీకరించడం, నష్టాలను తగ్గించుకోవడం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్థిరమైన ఆర్థిక శ్రేయస్సు కోసం ఇది ఎంతో ముఖ్యమైనది.

అల్లు అర్జున్ అరెస్టుపై మాట మార్చిన టాలీవుడ్ కమెడియన్… భయపడుతున్నారా?