అధికారం దక్కినా అదే లొల్లా ? 

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) ఉంటుంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ఇవన్నీ షరా మామూలు వ్యవహారాలే.ఎవరికి వారు తామే గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.

అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని రాష్ట్ర పార్టీలో పెత్తనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అందుకే ఎప్పుడూ తెలంగాణ కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం కనిపించదు.అసలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలేదు.

అయితే గత నెల , రెండు నెలలుగా కాంగ్రెస్ ప్రభావం కనిపించడం,  పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం వంటి వ్యవహారాలన్నీ కలిసి వచ్చాయి .

ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎక్కువ చొరవ చూపించారు.

"""/" / తనను వ్యతిరేకిస్తున్న సొంత పార్టీ నాయకులను కలిసి వారి మద్దతు పొందే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.

  ఏది ఏమైనా , రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకుంది.

ఇంతవరకు బాగానే ఉన్నా.  ఇప్పుడు పదవులు విషయంలో మళ్ళీ పేచీ మొదలైంది.

అసలు తెలంగాణ కాంగ్రెస్ కు ఉపు రావడానికి , ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ఎంతగానో కష్టపడ్డారు అనే విషయం అందరికీ తెలిసిందదే.

అందుకే రేవంత్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావిస్తున్నారు.అధిష్టానం పెద్దలు కూడా దాదాపుగా ఈ విషయంలో ఒక క్లారిటీకి వచ్చేశారు.

అయితే రేవంత్ కు పదవి  ఇచ్చేందుకు వీలు లేదని , తమ పేరు పరిశీలనలోకి తీసుకోవాలని ఒత్తిడి హై కమాండ్ పెద్దలపై పెరుగుతుంది.

అందుకే కాంగ్రెస్ విజయం సాధించి మూడు రోజులు అవుతున్న,  సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ క్లారిటీ తీసుకోకపోవడానికి కారణాలు ఇవేనట.

"""/" /  ముఖ్యమంత్రిగా తమ పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  భట్టి విక్రమార్కులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు .

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో సమావేశం కానున్నారు.ఈరోజు మధ్యాహ్నం కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే , డీకే శివకుమార్ ( DK Shivakumar )సమావేశం కాబోతున్నారు.

ఆ తరువాత ఏం చేయాలనే విషయంపై ఒక క్లారిటీకి రానున్నారు.ఇది ఇలా ఉండగానే కొంతమంది సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయవద్దని మల్లికార్జున ఖర్గేను కోరుబోతున్నారట.

అయితే అధిష్టానం మాత్రం సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి పేరును పంపే అవకాశం ఉంది.

రేపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేలా నిర్ణయం వెలువబోతోంది.అయితే సీఎం గా ఎవరిని ఎంపిక చేశారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

రాజమౌళి ఫస్ట్ లవ్ స్టోరీ మీకు తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!