ఓటర్‌ గుర్తింపు కార్డు లేకున్నా… ఈ 12 గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా ఓటు వేయొచ్చు!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ప్రత్యామ్నాయంగా వివిధ గుర్తింపు డాక్యుమెంట్లను చూపించి ఓటు వేసే అవకాశాన్ని భారత ఎన్నికల కమిషన్‌ కల్పించిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు.

ఎన్నికల సిబ్బంది ఇంటింటా పంపిణీ చేసే ఫొటోతో కూడిన ఓటరు చీటీ కేవలం పోలింగ్ కేంద్రం, ఓటర్ల జాబితాలో క్రమ సంఖ్యతో కూడిన సమాచారం కోసం మాత్రమేనని చెప్పారు.

ఓటు వేయడానికి వెళ్లే ముందు ఆ స్లిప్పుతోపాటు ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన 12 గుర్తింపు కార్డులలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏదో ఒకటి కిందు గుర్తింపు పత్రం చూపించాలన్నారు.

ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, ఎంఎన్‌ఆర్‌జీఏ జాబ్‌కార్డు, పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌ జారీ చేసిన ఫొటోతో ఉన్న పాస్‌బుక్‌, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, ఇండియన్‌ పాస్‌పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్‌ మంజూరు డాక్యుమెంట్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ కార్డు,ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం,దివ్యాంగుల ఐడెంటిటీ కార్డు, ఏదైనా ఒక గుర్తింపు కార్డులను తీసుకొని పోలింగ్‌ కేంద్రంలో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి పేర్కొన్నారు.

బలగం వేణుకి హీరో దొరికాడా..? నాని హ్యాండ్ ఇచ్చిన కూడా ఆ కుర్ర హీరోను సెట్ చేశాడా..?