పేర్లు మార్చినా పథకాలు అవే ! టీడీపీ మ్యానిఫెస్టో ఆకట్టుకోలేదా ?

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.

అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ కొత్త మేనిఫెస్టోకు( Manifesto ) రూపకల్పన చేశారు.

మరో మేనిఫెస్టోను ఎన్నికలకు ముందు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.పూర్తిగా జనాల దృష్టిని ఆకర్షించే విధంగా టిడిపి తమ మేనిఫెస్టో ఉంటుందని అంచనా వేసి ప్రకటించినా, ఆ ప్రకటన తర్వాత పెదవి విరుపులే కనిపించాయి.

ఏపీలో ప్రజలు పూర్తిగా సంక్షేమ పథకాలకు, నగదు బదిలీ పథకాలకు అలవాటు పడిపోయారని భావించిన తెలుగుదేశం తమ కొత్త మేనిఫెస్టో లోను అదే తరహా లో పథకాలను ప్రకటించింది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాదిరిగానే టిడిపి( TDP ) మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు ఉండడం తో ఈ మేనిఫెస్టో అంతగా జనాలను ఆకట్టుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  టిడిపి మహానాడులో జనసేనతో పొత్తు అంశంపై మాట్లాడుతారని భావించినా, దాని సంగతి పక్కన పెట్టేసారు.

"""/" / అలాగే గత ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించలేదు.అలాగే రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్దామనే విషయంలోనూ ప్రసంగాలు కనిపించలేదు.

పూర్తిగా వైసిపి , జగన్( YCP, Jagan ) ను టార్గెట్ చేసుకుని ప్రసంగాలు కొనసాగాయి.

ఇక టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలలో స్త్రీలు, యువత, రైతులు నిరుపేద వర్గాలే లక్ష్యంగా చేసుకుని మేనిఫెస్టోను ప్రకటించారు.

ప్రత్యేక హోదా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి , ద్రవ్యోల్బణ నియంత్రణ, తదితర అంశాలను అంతగా పట్టించుకోలేదు.

టిడిపి అధికారంలోకి వస్తే భవిష్యత్తుకు భరోసా ఇస్తామనే ప్రయత్నం చేశారు.అలాగే కర్ణాటకలో( Karnataka ) కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను పోలి ఉండే విధంగా టిడిపి మేనిఫెస్టో కనిపించింది.

మహా శక్తి , యువ గళం,  అన్నదాత, బీసీకి రక్షణ చట్టం, ఇంటింటికి తాగునీరు, పేదలని సంపన్నులను చేయడం, ఇలా ఆరు అంశాలను ప్రకటించారు.

అలాగే నగదు బదిలీలతో కుటుంబాన్ని ఆదుకుంటామంటూ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇచ్చే పథకాలనే అర్హత , వయసును కుదించి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే ప్రతి మహిళకు నగదు బదిలీ వర్తింప చేస్తామని ప్రకటించారు.

"""/" / ఉచితంగా బస్సు ప్రయాణం, దీపం పేరుతో ఏట మూడు సిలిండర్ల గ్యాస్ ఉచితంగా ఇస్తామని,  యువతకు ఉద్యోగాలు ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తామని,  రైతు కుటుంబానికి ఏటా నగదును పెట్టుబడి సాయం కోసం ఇచ్చే విధానాన్ని చెప్పారు.

కొన్ని కొన్ని కొత్త పథకాలు మేనిఫెస్టోలో ప్రకటించిన చాలావరకు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేని వాటికి పేర్లు మార్చి టిడిపి మేనిఫెస్టోలో చేర్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గిద్దలూరు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!