బొత్స త‌గ్గినా.. వారు మాత్రం త‌గ్గ‌ట్లేదుగా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫేస్ పంచ్ ద్వారా హాజరయ్యే విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ‌ సంఘాల నేతలు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ హాజ‌రు విధానంపై తమ స్మార్ట్‌ ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్‌ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఏర్పాట్లు పాఠశాలలోనే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అంతే కాకుండా ప్రభుత్వమే మొబైల్‌ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని అంటున్నారు.

అయితే పాఠాలు చెప్పడం మానుకుని టీచర్లంతా యాప్ లో తమ ఫేస్ రికగ్నిషన్ కు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ అసలు విధులు పక్కన పడేస్తున్నారన్న వాదన కూడా ఉంది.

ఈ దశలో తాము ఏం చెప్పాలనుకున్నామో ఏం చేయాలను కున్నామో అదే చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.

ఆందోళ‌న‌కే సిద్దం.! అయితే ఈ విధానంలో కొన్ని మార్పులు.

సవరణలు మాత్రం తప్పవని వాటిని కూడా సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా అమలు చేస్తామని బొత్స అంటున్నారు.

ఆ విధంగా పాఠశాలలకు వచ్చే ఉపాధ్యాయులకు మొబైల్స్ లేకపోయినా సరే.లేదా వారు తీసుకు రాకపోయినా సరే ఇతరుల మొబైల్ నుంచి హాజరు వేయవచ్చని ఆఫ్ లైన్ లో కూడా హాజరు వేయవచ్చనే మార్పును ఎట్టకేలకు స్పందించారు.

కానీ ఇన్ని జరిగినా మాస్టార్లు మాత్రం వెన‌క్కి తగ్గడం లేదు.కొన్ని సంఘాలు ఆందోళనలకే సిద్ధం అవుతున్నాయి.

చాలా రోజులకు మంత్రి బొత్స దిగివ‌చ్చినా ఉపాధ్యాయులు మాత్రం తాము తగ్గేదేలే అంటున్నారు.

ఇక‌ఇప్పటికే ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు శాతం నమోదు చేయాలని ఏపీ సర్కారు భావిస్తోంది.

అందుకు అనుగుణంగానే జీతభత్యాలు చెల్లించాలని చూస్తోంది.కానీ ఈ ఒక్క విధానం ఇప్పుడు విద్యాశాఖలోనే కాదు మిగతా శాఖల్లోనూ తీసుకు రానున్నామని చెబుతున్నారు బొత్స అంటున్నారు.

అంటే ఇకపై అన్ని శాఖలకూ విధుల నిర్వహణ అన్నది కఠినతరం కానుందని చెప్పకనే చెబుతున్నారు.

అయితే ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యే క్రమంలో నిమిషం ఆలస్యం అయితే ఆ రోజు పాఠశాలకు గైర్హాజరయ్యారు అన్న విధంగా నిబంధనను రూపొందించారు.

దీనిని మాత్రం యాప్ నుంచి తొలగిస్తామని బొత్స చెబుతున్నారు.ఇక అది తప్ప మిగిలిన నిబంధనలు అన్నీ తప్పక అమలు అవుతాయని కూడా బొత్స చెబుతున్నారు.

ఇక ఉపాధ్యాయ సంఘాలతో తాజాగా జరిపిన చర్చలు కూడా విఫ‌ల‌మైన‌ట్లు తెలుస్తోంది. """/" / అంద‌రూ చేసుకోవాల్సిందే.

అయితే బొత్స మాత్రం ఫేస్ అటెండెన్స్ యాప్ పై కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఉందని చెప్పారు.

మంచి లక్ష్యానికి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.15 రోజులు శిక్షణా తరగతులు నిర్వహించి యాప్‌ అమల్లోకి తెస్తామ‌న్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమ‌ని.ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని రిజిస్టర్‌ చేసుకున్నార‌ని చెబుతున్నారు.

మిగతా 50 శాతం మంది త్వరలోనే రిజిస్టర్‌ చేసుకుంటార‌ని అన్నారు హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే ఉంటాయ‌ని.

మిగతా విభాగాల్లోనూ ఇదే విధానం అమలు కావ‌చ్చ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే4, శనివారం 2024