MP Laxman : కేసీఆర్ కాళ్ల బేరానికి వచ్చినా పొత్తు ఉండదు..: ఎంపీ లక్ష్మణ్

నిర్మల్ జిల్లా భైంసాలో బీజేపీ విజయసంకల్ప యాత్ర( BJP Vijaya Sankalpa Yatra ) కొనసాగుతోంది.

యాత్రలో భాగంగా ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మతోన్మాద రాజకీయ పార్టీలను ఎదుర్కొనే శక్తి కేవలం బీజేపీకే ఉందన్నారు. """/" / రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్( BRS, Congress ) పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని పేర్కొన్నారు.

కేసీఆర్( KCR ) కాళ్ల బేరానికి వచ్చినా బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉండదని చెప్పారు.

అలాగే రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పది స్థానాలను ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.

అయితే లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ఇవాళ ఐదు క్లస్టర్లలో విజయసంకల్ప యాత్ర పేరిట బస్సు యాత్రలను చేపట్టిన సంగతి తెలిసిందే.

భారతీయ ముఠాల మధ్య ఆధిపత్య పోరు .. కెనడాలో ఇద్దరి హత్య, కోర్ట్ సంచలన తీర్పు