రేపు ఎన్నికలు పెట్టినా సిద్ధం..: మంత్రి తలసాని

జమిలి ఎన్నికలపై తెలంగాణ సీఎం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.తెలంగాణలో ఏ ఎన్నికలకైనా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఈ మేరకు రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా తాము సిద్ధమని తెలిపారు.

జమిలి ఎన్నికలని యూపీ, కర్ణాటక ఎన్నికలు జరిపించారని పేర్కొన్న మంత్రి తలసాని జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.

వన్ ఎలక్షన్ నినాదం ప్రధాని మోదీ ఇప్పుడు పెట్టింది కాదన్నారు.దేశంలో మోదీకి ఆదరణ తగ్గిపోయిందని మంత్రి తలసాని వెల్లడించారు.

వామ్మో.. బాలయ్యలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ఈ విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!