కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమైనా బీజేపీదే విజయం..: కిషన్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో సమన్యాయం పాటించామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

ఈ క్రమంలోనే మహిళలకు అత్యధిక సీట్లు ఇచ్చామని తెలిపారు.బీసీ అభ్యర్థులను అధిక సంఖ్యలో బీజేపీ బరిలోకి దింపిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల పోటీ చేస్తున్నారని తెలియగానే కేసీఆర్ కు నిద్ర పట్టలేదని విమర్శించారు.

గజ్వేల్ లో ఓడిపోతామని కామారెడ్డికి కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు.కేసీఆర్ ను రక్షించడానికే రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు.

అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏకమైనా కామారెడ్డిలో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

వైరల్ : భాగస్వామి లేకుండానే 14 పిల్లలను కన్న కొండ చిలువ..