Bolishetti Satyanarayana : ఇన్నేళ్లుగా కష్టపడినా పార్టీలో గుర్తింపు దక్కలేదు..: బొలిశెట్టి

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి.పొత్తుల నేపథ్యంలో టీడీపీ - జనసేన - బీజేపీ( TDP - Janasena - BJP ) అభ్యర్థులను ప్రకటిస్తుండగా.

టికెట్ రాని నేతలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.ఈ క్రమంలోనే జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ( Bolishetti Satyanarayana ) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు.

సంపాదనతో పాటు కుటుంబాన్ని సైతం వదిలి పెట్టి పార్టీ కోసం కష్టపడ్డానన్నారు.దాదాపు పది సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం ధనాన్ని వెచ్చించానని తెలిపారు.

కానీ ఇంత కష్టపడినా తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఇప్పుడు కావాల్సింది సంయమనం అన్న బొలిశెట్టి చేయాల్సింది యుద్ధం అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మన ప్రభుత్వం వస్తుంది.అందరికీ న్యాయం చేస్తుంది అని పోస్ట్ చేశారు.

ప్రస్తుతం బొలిశెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?