ఆ యువ హీరో పెళ్లి తర్వాత అయినా సక్సెస్‌ ట్రాక్ ఎక్కేనా?

2017 సంవత్సరంలో వచ్చిన శతమానం భవతి సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని యంగ్‌ హీరో శర్వానంద్‌ దక్కించుకోలేదు అని చెప్పాలి.

ఏడాదికి రెండు చొప్పున సినిమాలు చేస్తున్నాడు కానీ మధ్యలో ఒకటి రెండు కాస్త పర్వాలేదు అన్నట్లుగా నిలిచాయి కానీ ఈ అయిదు సంవత్సరాల్లో సాలిడ్ విజయాన్ని మాత్రం ఆయన సొంతం చేసుకోలేక పోయాడు.

గత ఏడాది వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచినా కూడా కమర్షియల్‌ గా నిరాశ మిగిల్చింది.

అంతకు ముందు జాను సినిమా కూడా మంచి పేరు అయితే తెచ్చింది కానీ సినిమా వసూళ్ల విషయంలో నిరాశను మిగిల్చింది.

అందుకే శర్వానంద్‌ కెరీర్ ఈ మధ్య కాలంలో కాస్త ఇబ్బందుల్లో ఉంది అంటూ ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలో ఆయన పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్ధం అవ్వడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అతి త్వరలోనే శర్వానంద్‌ పెళ్లి జరగబోతుంది. """/"/ నిన్న టాలీవుడ్‌ ప్రముఖులు హాజరు అవ్వగా భారీ ఎత్తున వివాహ నిశ్చితార్థ వేడుక జరిగింది.

కొత్తగా వైవాహిక జీవితంలో అడుగు పెట్టబోతున్న శర్వానంద్‌ కు ఇక పై అయినా కాలం కలిసి వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్న శర్వానంద్‌ ఈ మధ్య కాలంలో కొత్త సినిమాకు కమిట్‌ అయ్యాడు.

"""/"/ ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.ఒకే ఒక్క జీవితం సినిమా మాదిరిగానే త్వరలో చేయబోతున్న సినిమా కూడా ద్వి భాష చిత్రంగా తెలుస్తోంది.

శర్వానంద్‌ పెళ్లి అయిన తర్వాత ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్న శర్వానంద్‌ కొత్తగా సినిమా లు చేసి వరుసగా సక్సెస్ లను దక్కించుకోవాలని మనమూ కోరుకుందాం.

ఆల్‌ ది బెస్ట్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌.

తెలుగుదేశం పార్టీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్..!!