హీరోగా నటించా అయినా బ్యాంకులో ఒక్క రూపాయి లేదు: ఆదిత్య ఓం

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఎప్పుడు ఒకేలా ఉంటారు అనుకోవడం పొరపాటు.ఎందుకంటే వారి జీవితాలు ఎలా ఉంటాయో వారికి కూడా తెలియదు.

ఒకప్పుడు మంచి హోదాలో ఉన్నా కూడా.మధ్యలో చేతిలో చిల్లి గవ్వ లేని రోజులు కూడా వస్తుంటాయి.

నిజానికి వారి జీవితాలు ఒకేలా ఉండవు.కానీ చాలామంది అనుకుంటారు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు బాగా ధనవంతులు అని.

తమకు నచ్చినట్లుగా సంపాదించుకుంటూ పోతారని.కానీ వారి నిజ జీవితంలో కూడా కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి.

అలా ఇప్పటికి చాలామంది మంచి హోదాలో ఉండి తర్వాత కష్టాలను ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు.

వాళ్లు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కూడా వాళ్ళు గతంలో పడిన కష్టాలు గురించి కూడా తెలిపేవారు.

అలా తాజాగా మరో నటుడు కూడా తను గతంలో పడిన కష్టాలు గురించి తెలిపాడు.

ఇంతకు అతడు ఎవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం.

ఆదిత్య ఓం అంటే చాలామందికి అంత త్వరగా గుర్తొచ్చే పేరు కాదని చెప్పాలి.

కానీ లాహిరి లాహిరి లాహిరిలో నటించిన తను హీరో అంటే ఎవరైనా గుర్తుపడతారు.

2002లో ఈ సినిమాతో అడుగుపెట్టిన ఆదిత్య తన తొలి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అదే ఏడాది ధనలక్ష్మి ఐ లవ్ యు సినిమాలో నటించాడు.

ఇక ఈ సినిమా కూడా మంచి సక్సెస్ రావటంతో అలా వరుసగా అవకాశాలు అందుకుంటూ ఓ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడు.

"""/"/ ఇక తెలుగులోనే కాకుండా హిందీ, ఉర్దూ భాషల్లో కూడా నటించాడు.ఇక ఈయన నటుడుగానే కాకుండా స్క్రీన్ ప్లే, పాటల రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.

అయితే ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

అంతేకాకుండా గతంలో తను ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా తెలిపాడు.తను బాగా చదువుకునేవాడట.

కానీ తనకు నటన మీద ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి అడుగు పెట్టాడట.కాని తన తండ్రికి మాత్రం తను సినిమాల్లో నటించడం ఇష్టం లేదట.

అయినా కూడా తను సినిమాలలో నటించి ఒక గుర్తింపు సొంతం చేసుకున్నానని తెలిపాడు.

అయితే ఓసారి తనకు సినిమాల పరంగా కొన్ని కష్టాలు రావడంతో ఆ సమయంలో తన దగ్గర డబ్బులు కూడా లేవట.

"""/"/ కనీసం అంతకుముందు సంపాదించిన డబ్బులు కూడా బ్యాంకులో కూడా లేవట.ఇక ఆ సమయంలో తన తనకు సహాయం చేశాడు అని.

తన తండ్రికి తను సినిమాలలో ఉండటం ఇష్టం లేకున్నా కూడా ఆ సమయంలో మాత్రం తనకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు అని తెలిపాడు.

తర్వాత మెల్లిమెల్లిగా కోలుకొని ఇప్పుడు మరింత రెట్టింపుతో ఆనందంగా ఉన్నాను అని తెలిపాడు.

రిషబ్ శెట్టి డైరెక్షన్ లో యంగ్ టైగర్.. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమా?