దేవుడా: అక్కడ బికినీ వేసుకోకపోతే ఫైన్..!

ఈ విషయం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు.ఎందుకంటే మహిళలు బికినీ వేసుకోకుండా ఆట ఆడారని సదరు మహిళలకు ఫైన్ వేశారు.

ఏంటి బికినీ వేసుకుని ఆడకపోతే ఫైన్ వేయడం ఏంటి అని అనుకుంటున్నారా.? కానీ ఆది అక్కడ రూల్ అట.

ఆ రూల్ ప్రకారం ఆటలో పాల్గొన్న మహిళలు బికినీ ధరించకుండా షార్ట్ వేసుకుని ఆడారని ఫైన్ వేసారట.

ఇంతకీ అసలు ఆ ఆట ఏంటి.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బల్గేరియాలోని వర్నాలో ఇటీవల యూరోపియన్ బీచ్ హ్యాండ్‌ బాల్ చాంపియన్‌షిప్ జరిగింది.ఆ ఛాంపియన్ షిప్ లో నార్వే మహిళలు కూడా హ్యాండ్ బాల్ ఆడడం జరిగింది.

కానీ వాళ్ళు రూల్స్ ప్రకారం బికినీ వేసుకోకుండా నిబంధనలను అతిక్రమించి షార్ట్స్ వేసుకోవడంతో ఫైన్ వేసారట.

మ్యాచ్ లో పాల్గొన్న ప్లేయర్స్ అందరికీ యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) ఆ జట్టు మొత్తానికి 1500 యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీ లో 1,31,700 రుపాయాల జరిమానా విధించారు.

అంటే జట్టు 10 మంది సభ్యులతో కూడి ఉన్నది కావున ఒక్కొక్కరు 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.

"""/"/ స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌ లో నార్వే జట్టు మహిళలు బికినీల బదులు షార్ట్స్ వేసుకొని బరిలోకి వెళ్లారు.

అయితే ఇలా బికినీ వేసుకుని ఆడడం ఎంత వరకు సమంజసం అని ఈ నిభంధనను వెనక్కి తీసుకోమని గత కొంత కాలంగా ఆటగాళ్లు కోరుతున్నారు.

అందుకనే ఈ రూల్ కి వ్యతిరేకంగా నార్వే మహిళలు నిరసన తెలపడానికే బికినీ వేసుకోకుండా షార్ట్స్ ధరించి బరిలోకి దిగారని నార్వే హ్యాండ్‌ బాల్ ఫెడరేషన్ ప్రకటించింది.

"""/"/ కానీ యూరోపియన్ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) వాళ్ళు షార్ట్ వేసుకుని ఆట ఆడినందుకు ఫైన్ వేశారని, అయితే ఇలా ఆటగాళ్లకు విధించిన ఫైన్ ఏదయితే ఉందో అది నార్వే హ్యాండ్ బాల్ ఫెడరేషన్ వాళ్లే చెల్లిస్తామని కూడా స్పష్టం చేసారు.

మరి ఈ రూల్ ఎప్పటికి మారుతుందో అనేది చూడాలి.

చిరంజీవి స్టాలిన్ పోస్టర్ తో అద్భుతం సృష్టించిన ప్రశాంత్ వర్మ?