ఆ దేశాలలో జనాభా బాగా తగ్గిపోతుందట.. కారణం ఏంటంటే..?
TeluguStop.com
ప్రపంచంలోనే అత్యధిక జనాభా( Highest Population ) ఉన్న దేశాల్లో ఇండియా నెంబర్ వన్ గా ఉంది.
ఇక ఇండియా తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది.చైనా జనాభా( China Population ) క్రమంగా తగ్గుతూ వస్తోందని, అంతేకాకుండా వృద్ధుల జనాభా కూడా పెరుగుతుందని చెబుతున్నారు.
దీంతో చైనా కలవరపాటుకు గురవుతుంది.ఇక మరికొన్ని దేశాల్లో జనాభా చాలా తక్కువగా ఉంటుంది.
జనాభా తక్కువగా ఉండటంతో పాటు జనాభా విపరీతంగా పడిపోతున్న దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
"""/"/
బెలారస్, బోస్నియా, బల్గేరియా, బెర్ముడా, అల్బేనియా, క్రొయేషియా, క్యూబా, ఎస్తోనియా, జార్డియా, జర్మనీ, గ్రీస్, హాంకాంగ్, హంగేరీ, ఇటలీ, జపాన్, లాత్వియా.
బెబనాన్.పోలాండ్, రొమేనియా.
, రష్యా, సెర్బియా.సింగపూర్, సౌత్ కొరియా, స్పెయిన్, ఉక్రెయిన్ దేశాల్లో జనాభా బాగా తగ్గిపోతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
యూరప్ దేశాల్లో ఎక్కువగా జనాభా అనేది తగ్గుతూ వస్తోంది.అలాగే జనాభా తగ్గుతున్న ఈ దేశాల్లో ఎక్కువగా సంపన్న దేశాలు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
"""/"/
అయితే జనాభా తగ్గడానికి ప్రధాన కారణం పిల్లలను కనకపోవడమేనని తెలుస్తోంది.పిల్లలను కనేందుకు చాలామంది ఇష్టపడటం లేదని, అబార్షన్లు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని తేలింది.
జనాభా తక్కువగా ఉండటంతో చాలా దేశాలు విదేశీయులను ఆకర్షిస్తున్నాయి.ఇక్కడే స్ధిరపడి ఇల్లు కట్టుకుంటే అవసరమైన డబ్బు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
ఇక జపాన్( Japan )లో జనాభా తగ్గిపోవడమే కాకుండా వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
దీంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.ఇక జపాన్‌లో టోక్యో, క్యోటో లాంటి నగరాల్లోనే ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు.
దీని వల్ల గ్రామాల్లో జనాభా భారీగా తగ్గిపోతోంది.జనాభా తగ్గిపోవడం వల్ల కంపెనీల్లో పనిచేయడానికి మనుషులు కూడా దొరకడం లేదు.
పుష్ప సీక్వెల్ లో శ్రీలీల లుక్ లీక్.. డ్యాన్స్ తో మరోసారి అదరగొట్టడం పక్కా!