నా కొడుకును ట్రోల్ చేస్తే జైల్లో పెడుతా.. టీవీ నటుడు ప్రభాకర్ పై ట్రోల్స్!
TeluguStop.com
ఈటీవీ ప్రభాకర్ గురించి మనందరికీ బాగా తెలిసిన విషయమే.దూరదర్శన్ ద్వారా తన కెరియర్ ప్రారంభించి ఆ తరువాత ప్రారంభించబడిన ఈటీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు మిగతా ఛానల్స్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈటీవీలో ప్రవేశిస్తూనే అనేక సీరియల్స్లో నటిస్తూ ఆ సంస్థ అధినేత అయిన కిరణ్ కి బాగా దగ్గర అయ్యాడు.
ఈటీవీ సంస్థ తనదే అన్న అంత చనువుగా తిరిగేవాడు.తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ, ఆ సంస్థ అధినేత రామోజీరావు తో విభేదాలు కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు రావలసి వచ్చింది.
అయినప్పటికీ పలు మిగతా ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించి బుల్లితెర చిరంజీవి గా పేరు తెచ్చుకున్నాడు.
అంతే కాకుండా పలు సినిమాలలో దర్శకత్వం వహించాడు.నిర్మాతగా కూడా బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు.
ఇక బుల్లితెరలో అత్యధిక పారితోషకం లో ప్రభాకర్ మొదటి స్థానంలో ఉన్నాడు.ఇదిలా ఉంటే ప్రభాకర్ గతంలో ఫ్యామిలీ గురించి కూడా ఎప్పుడు పరిచయం చేయలేదు.
ఈ మధ్య రీ ఎంట్రీ తో తన కుటుంబాన్ని కూడా పరిచయం చేస్తున్నాడు.
పలు షోలలో కూడా తన భార్యతో కలిసి తెగ సందడి చేశాడు. """/" /
మంచి హోదా లో ఉన్న సమయంలోనే ప్రభాకర్ మలయజ అనే యువతి తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు.
ఇక వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.మలయజ మనకు చాలా సుపరిచితమే.
ఆమె తన భర్త ప్రభాకర్ తో కలిసి ఇష్మార్ట్ జోడి లాంటి పలు టీవీ షో ద్వారా మన అందరినీ అలరించారు.
ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటారు.
ఇక ప్రభాకర్ పిల్లల్లో ఒకరైన దివిజ కూడా పలు టీవీ షో ద్వారా మనకు పరిచయమే.
ఆమె చిన్నప్పటి నుంచి కూడా టీవీ షోస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది.
ఈమె కేవలం నటన మాత్రమే కాకుండా, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుంకుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే ప్రభాకర్ కొడుకు కూడా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఏకంగా హీరోగానే తన పరిచయాన్ని పెంచుకోనున్నాడు. """/" /
ప్రభాస్ కొడుకు పేరు చంద్రహాస్.
అయితే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా అతడు హీరోగా ఎంట్రీ చేస్తున్న విషయాన్ని తెలిపారు.
దీంతో సోషల్ మీడియాలో ఇతడి హీరో ఏంటి అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
పైగా చంద్రహాస్ ఓ మీడియాతో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.అందులో అతడు చాలా ఓవర్ గా మాట్లాడాడు అని.
ఇతర హీరోలను ఉద్దేశించి కూడా మాట్లాడాడు అని అంటున్నారు.దీంతో ప్రభాకర్ తన కొడుకు పై ట్రోల్ చేస్తున్న వారిపై బాగా క్లాస్ పీకాడు.
నా కొడుకుని ట్రోల్ చేస్తే జైల్లో పెడతా అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు.
అయిన కొందరు టోలర్స్ ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.ఇక మరికొందరు ప్రభాకర్ కొడుకు హీరోగా బాగా రాణించాలి అని కోరుకుంటున్నారు.
డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్