జబర్దస్త్ కు రోజురోజుకు దూరం అవుతున్న ఆర్టిస్ట్ లు.. అసలు కారణమేమిటంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఈ జబర్దస్త్ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు.

ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ వస్తోంది.

ఇది ఇలా ఉంటే రానురాను జబర్దస్త్ షో కి కళ మారిపోతోంది.ఇందుకు గల కారణం జబర్దస్త్ నుంచి మెల్లమెల్లగా ఒక్కొక్క ఆర్టిస్ట్ జబర్దస్త్ షో నుంచి విడిపోయి వెళ్ళిపోతున్నారు.

మొదటి 2019 జబర్దస్త్ షో నుంచి నాగబాబు వెళ్లిపోగా.నాగబాబు తో పాటు పలువురు ఆర్టిస్టులు కూడా వెళ్ళిపోయారు.

ఆ తరువాత ఒక్కొక్కరుగా జబర్దస్త్ వీడి ఇతర షోలలో సెటిల్ అవుతున్నారు.ఇటీవలె జబర్దస్త్ జెడ్జ్ రోజా మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్యకాలంలో కొత్త కొత్త టీమ్ లు జబర్దస్త్ షో కి ఎంట్రీ ఇస్తున్నప్పటికీ ఇదివరకు స్కిట్ లలో కమెడియన్స్ మాదిరిగా నవ్వులు పూయించే లేకపోతున్నారు.

ఇప్పటికే జబర్దస్త్ షో నుంచి ముక్కు అవినాష్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, ఆర్పి, అప్పారావు ఇలాంటి ఆర్టిస్టులు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ సుడిగాలి సుధీర్, జబర్దస్త్ ని హైపర్ ఆది భుజాలపై మోసుకొని నెట్టుకొస్తున్నారు.

"""/" / అయితే జబర్దస్త్ షో దాదాపు 10 ఏళ్ల ప్రస్థానంలో ఎప్పటికీ వెనక్కి తిరిగి చూసుకోక పోవడమే కాకుండా టిఆర్పి రేటింగ్ విషయంలో రికార్డులను బద్దలు కొట్టేసింది.

ప్రస్తుతం హైపర్ ఆది, సుధీర్ కూడా జబర్దస్త్ కి దూరంగా వెళ్లి పోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హైపర్ ఆది కొన్ని వారాలుగా జబర్దస్త్ షోలో కనిపించకపోవడంతో ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

గత వారంలో సుడిగాలి సుధీర్, గెటప్ శీను లేకుండానే ఆటో రాంప్రసాద్ ఒక్కడే స్కిట్ చేశాడు.

అయితే చూస్తుంటే ఫోను ఫోను జబర్దస్త్ షోలో ఏదో జరుగుతుంది అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరి ఆర్టిస్టులు జబర్దస్త్ షోని విడిపోతున్నందుకు కారణాలు మాత్రం తెలియడం లేదు.

Monica, Zorrell : షిప్‌లో శాశ్వతంగా నివసించడానికి ఉద్యోగాలు వదిలేసిన యూఎస్ కపుల్.. చివరికి..?