షూటింగ్ కు వెళ్తూ రైలులో జారిపడి జబర్దస్త్ నటుడి మృతి.. అసలేం జరిగిందంటూ?
TeluguStop.com
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా కూడా మరో విషాదం చోటు చేసుకుంది.
అదేమిటంటే.షూటింగ్ కీ వెళ్తూ రైలులో నుంచి జారీపడి జబర్దస్త్ నటుడు మృతి చెందాడు.
ఆ నటుడు ఎవరు ఏంటి అన్న వివరాల్లోకీ వెళితే.చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్( Medara Mohammedin ) భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ కు ఉదయం వచ్చారు.
అయితే అదే సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను( Kakatiya Express ) ఎక్కేందుకు ప్రయత్నించారు.
"""/" /
కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు.వెంటనే లోపలున్న ప్రయాణికులు చైన్ లాగారు.
తరువాత రైల్వే పోలీసులు( Railway Police ) సిబ్బంది సహాయంతో మహ్మద్దీన్ ను బయటకు లాగి 108 లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా, నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలు అవ్వడంతో బాధితుడిని వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో సేవలందించారు.
తరువాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు.
మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవాల గదిలో భద్రపరిచారు. """/" /
మహ్మద్దీన్ ఈటీవీ జబర్దస్త్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు.
ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్స్ లలో పలు పాత్రలు పోషించారు.షూటింగ్ ఉందని చెప్పి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఉదయం స్టేషన్‌కు వచ్చారు.
ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు.మృతుడికి భార్య, డిగ్రీ, పదోతరగతి చదివే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మహ్మద్దీన్ మృతితో నందాతండాలో విషాదం అలుముకుంది.
భారతీయ పాటకు దీపావళి వేళ అద్భుతమైన డ్యాన్స్ తో అదరగొట్టిన అమెరికన్ అంబాసిడర్