ఈట‌ల వ‌ర్సెస్ హ‌రీశ్‌రావు.. కేసీఆర్ ప్లాన్ స‌క్సెస్ అయిన‌ట్టుందే!

ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎప్పుడైతే మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారో అప్ప‌టి నుంచే కేసీఆర్ త‌న వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు.

ఆయ‌న విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ఎవ‌రిన ప‌డితే వారిని మాట్లాడ‌నివ్వ‌ట్లేదు.

పైగా ఈట‌ల‌కు అత్యంత స‌న్నిహితులుగా టీఆర్ ఎస్‌లో ఉన్న వారితోనే విమ‌ర్శ‌లు, ఆరోప‌న‌లు చేయిస్తున్నారు.

ఇందులో భాగంగానే బీసీ నాయ‌కుడైన గంగుల క‌మ‌లాక‌ర్‌ను రంగంలోకి దింపారు.అయితే ఈట‌ల‌కు అత్యంత సన్నిహితుడైన హ‌రీశ్‌రావును హుజూరాబాద్ రాజ‌కీయాల్లోకి దింపారు కేసీఆర్‌.

ఎందుకంటే హ‌రీశ్‌రావుకు ఉన్న ఇమేజ్ కార‌ణంగా టీఆర్ ఎస్‌వైపు కార్య‌క‌ర్త‌లు మ‌ళ్లే అవ‌కాశం ఉంది.

అలాగే ఈట‌ల‌కు హ‌రీశ్‌రావు మ‌ద్దతుగా నిల‌బ‌డే అవ‌కాశం ఉన్నందున ఆయ‌న్నే ప్ర‌త్య‌ర్థిగా ఉంచి ఇద్ద‌రి మ‌ధ్య‌ రాజ‌కీయ వైరం పెట్టాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌.

ఇప్పుడున్న ప‌రిస్థితులు చూస్తుంటే కేసీఆర్ ప్లాన్ స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది. """/"/ ఈట‌ల రాజేంద‌ర్ డైరెక్టుగానే హ‌రీశ్‌రావుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ద‌మ్ముంటే త‌న‌మీద గెల‌వాల‌ని స‌వాల్ విసురుతున్నారు.అటు హ‌రీశ్‌రావు కూడా ఈట‌ల‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇప్పుడు హుజూరాబాద్‌లో ఈట‌ల రాజేంద‌ర్ గెలుస్తారా లేక హ‌రీశ్‌రావు గెలుస్తారా ల‌నే విధంగా రాజ‌కీయాలను సృష్టించారు గులాబీ బాస్‌.

మొత్తానికి కేసీఆర్ అనుకున్న‌ది సాధించారంటూ రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. """/"/ ఇక హ‌రీశ్ రావు గురించి కూడా ఈట‌ల రాజేంద‌ర్ ఎన్నో వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంపై హ‌రీశ్‌రావును ఇన్ చార్జిగా పెట్టార‌ని ఇది చాలా దారుణ‌మ‌న్నారు.వాస్త‌వానికి టీఆర్ ఎస్ పార్టీలో అనేక అవ‌మానాలు అంద‌రికంటే ఎక్కువ‌గా ఎదుర్కొన్న‌ది హ‌రీశ్‌రావేన‌ని ఈట‌ల రాజేంద‌ర్ గ‌తంలో చెప్పారు.

ఈ విధంగా హ‌రీశ్‌రావుపై ఈట‌ల రాజేంద‌ర్ డైరెక్టుగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.కానీ హ‌రీశ్‌రావు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల గురించి డైరెక్టుగా మాట్లాడ‌లేదు.

కేవ‌లం ప్రెస్ నోట్ల ద్వారానే బ‌దులిస్తున్నారు.చూడాలి మ‌రి వీరి రాజ‌కీయాలు ఎలా మ‌లుపు తిరుగుతాయో.

వైరల్ వీడియో: ఇలా ట్రై చేయండి పైసా అవసరం లేకుండా చల్లటి నీటిని తాగేయొచ్చు..