హుజురాబాద్ లో పోటీ చేద్దాం ! హరీష్ కేసీఆర్ వస్తారా ?

 హుజురాబాద్ లో పోటీ చేద్దాం.కెసిఆర్ హరీష్ వస్తారా ? దమ్ముంటే నిజాయితీగా ఓట్లు వేయించుకోండి.

ప్రలోభాలు దావతులు ఆపండి .పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్లను వెనక్కి తీసుకోండి.

నా మనుషులను భయ పెట్టడం ఆపండి ' అంటూ హుజురాబాద్ బిజెపి అభ్యర్థిగా ప్రచారం అవుతున్న ఈటెల రాజేందర్ తెలంగాణ సీఎం కెసిఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టిఆర్ఎస్ కి హుజురాబాద్ దళితుల మీద ప్రేమ లేదు.కానీ వారి ఓట్లు మీద మాత్రమే ప్రేమ ఉంది.

టిఆర్ఎస్ నేతల మాటల్లో చేతల్లో నిజాయితీ లేదు.కనీసం తన డిపాజిట్ ను దెబ్బతీయగలరా అంటూ రాజేందర్ కెసిఆర్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.

ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో రాజేందర్ ను ఒంటరి చేసేందుకు కెసిఆర్ , హరీష్ రావు, గంగుల కమలాకర్ తదితరులు పూర్తిస్థాయిలో ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టడం,  ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ,  రాజేందర్ ముఖ్య అనుచరులను టిఆర్ఎస్ లో చేర్చుకుంటూ,  వారికి కీలక పదవులను అప్పగిస్తూ ఉండడం,  అలాగే కాంగ్రెస్ నుంచి కూడా నాయకులను చేర్చుకుని వారికి కీలకమైన పదవులు అప్పగిస్తూ టిఆర్ఎస్ అభ్యర్థికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తుండటంపై రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

  """/"/ టిఆర్ఎస్ కు ఇక్కడ గెలుపు అవకాశాలు లేవని తెలిసే ఇంతగా టెన్షన్ పడుతున్నారు అంటూ రాజేందర్ వ్యాఖ్యానిస్తున్నారు.

ముఖ్యంగా రాజేందర్ ను ఓడించేందుకు దళిత బంధు పథకం ప్రవేశపెట్టడంపై ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి.

ఈ పథకాన్ని కేవలం హుజురాబాద్ కు మాత్రమే పరిమితం చేయవద్దని,  రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయాలని కాంగ్రెస్ తో పాటు , బీజేపీ నేతలు డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సిద్దమవుతుండటంతో అన్ని పార్టీలు విమర్శల జోరును బాగా పెంచాయి.

ఇటీవలే పాదయాత్ర చేపడుతూ అస్వస్థతకు గురైన రాజేందర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వుండగానే  ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది అనే సంకేతాలు రావడంతో,  అకస్మాత్తుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడం, మళ్ళి పొలిటికల్ గా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ ఉండడం, టిఆర్ఎస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకోవడం వంటి పరిణామాలతో హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు రోజు రోజుకీ  వేడెక్కుతూనే ఉన్నాయి.

పుష్ప 2 సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!