మంత్రుల‌కు ఈట‌ల గట్టి కౌంట‌ర్‌.. ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డం క‌ష్ట‌మే!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని రాజ‌కీయాల‌న్నీ హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయి.రాష్ట్రంలో ఏ నేత ఏం మాట్లాడినా ఇన్ డైరెక్టుగా అది హుజూరాబాద్‌కు లింక్ అయ్యే ఉంటుంది.

ఇక ఇక్క‌డ గెలవాల‌ని టీఆర్ ఎస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే ఈట‌ల రాజేంద‌ర్ కూడా త‌న వంతుగా విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.ఇప్ప‌టికే మండలాల‌కు ఇన్ చార్జుల‌ను కూడా నియ‌మించి పక‌డ్బంధీగా ముందుకెళ్తున్నారు.

కాగా నిన్న హుజూరాబాద్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఈటల టీఆర్ఎస్ మంత్రుల‌పై హాట్ కామెంట్స్ చేశారు.

త‌న నియోజకవర్గంలో టీఆర్ ఎస్ చేస్తున్న రాజకీయాన్ని వివ‌రించారు.తనను ఓడించేందుకు టీఆర్ఎస్ మంత్రులు విశ్వప్రయత్నాలు చేస్తున్నార‌ని, అన్ని రకాలుగా అభివృద్ధి ప‌నులు చేస్తామంటూ చెబుతున్నార‌ని, అస‌లు వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్న‌డైనా ఈ ప‌నులు చేశారా అంటూ ప్ర‌శ్నించారు.

అంతే కాదు మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు పెట్టి మ‌రీ వారికి వార్నింగ్‌, స‌వాల్ విసిరారు.

"""/"/ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇస్తామంటున్న రేష‌న్‌కార్డులు, పింఛ‌న్లు, రోడ్లు, ఇత‌ర సౌల‌తుల విష‌యంలో ఆయ‌న కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఇస్తామంటున్న మంత్రులు.ఎప్పుడైనా వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇచ్చే స్వ‌తంత్రం ఉందా అంటూ ప్ర‌శ్నించారు.

సీఎం ను కాద‌ని వారంతా ఎప్పుడైనా ఈ అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేశారా అంటూ ప్ర‌శ్నించారు.

వారికి ఎలాంటి స్వ‌తంత్రం లేద‌ని, కానీ ఇక్క‌డ మాత్రం ఇచ్చేందుకు వ‌చ్చారంటూ ఎద్దేశా చేశారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో కుట్ర‌లు చేస్తున్న వారంద‌రికీ గుణపాఠం చెబుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌.

టీఆర్ఎస్ కు చెందిన ఐదుగురు మంత్రులు, కొంద‌రు ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మ‌కాం వేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని కులసంఘాలు, మహిళా సంఘాలను పిలిపించి త‌మ‌కే ఓటేసేలా బెదిరిస్తున్నారని వారి ఆట‌లు చెల్ల‌వ‌ని బెదిరించారు.

మ‌రి ఈట‌ల ప్ర‌శ్న‌ల‌కు మంత్రులు ఏమైనా స‌మాధానం చెప్తారో లేదో చూడాలి.

వరంగల్ కు నేడు కేసీఆర్ .. కాంగ్రెస్ కీలక నేతలతో నేడు రేవంత్ భేటీ