చాప కింద నీరులా పార్టీ విస్తరిస్తుంది: ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి( BJP ) చాప కింద నీరులా విస్తరిస్తుందని, ఒక్కసారిగా పైకి లేచిపోవడానికి రాజకీయాలు ఏమి సెన్సెక్స్ కాదని కీలక వ్యాఖ్యలు చేశారు చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్( Etela Rajender ) ఒకప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా తనకు తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు బాగా తెలుసని అందుకనే కుటుంబంలో ఇద్దరికీ పెన్షన్ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణా లో కుటుంబ పాలన అంతమొందించాల్సిన సమయం వచ్చిందని , ఇ ప్పుడు రాష్ట్రానికి కావలసింది జాతీయవాద రాజకీయ నాయకులని ఆయన చెప్పుకొచ్చారు.

"""/" / బిజెపి పై అసత్య ప్రచారాలు చేయడానికి కొన్ని పెయిడ్ న్యూస్ చానల్స్ ,యూట్యూబ్ ఛానల్స్ పుట్టుకొచ్చాయని వాటిని వెనకనుంచి ఎవరు నడిపిస్తున్నారో తమకు తెలుసని త్వరలోనే వారి ఆట కట్టిస్తామని ఆయన చెప్పుకొచ్చారు .

ప్రధానమంత్రి మోడి( PM Modi ) వరంగల్ కు 30 సంవత్సరాల తర్వాత వస్తున్నారని ఆయన సభను విజయవంతం చేయడానికి నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) ఆధ్వర్యంలో ఘనం గా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఉత్తర తెలంగాణలో భాజాపాకు బలం ఉందని వచ్చే ఎన్నికలలో కచ్చితంగా క్రియాశీలక పాత్ర పోషిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.

"""/" / తెలంగాణలో తమ విజయ యాత్ర 2019లో మొదలైందని కరీంనగర్ ఎంపీ సీటు తర్వాత దుబ్బాక హుజురాబాద్ లో ఆ విజయపరంపర కొనసాగిందని మునుగోడు లో కూడా నైతిక విజయం బిజెపి దేనని తమ కార్యకర్తల అకుంఠత పట్టుదల, దీక్ష తో వచ్చే ఎన్నికలలో పోరాడుతామని ఆయన చెప్పుకొచ్చారు .

రాష్ట్ర అధ్యక్షులుగా రెండుసార్లు బాధ్యత వహించడంతోపాటు కేంద్ర మంత్రి పదవులు కూడా నిర్వహించిన సీనియర్ నాయకుడు జి కిషన్ రెడ్డి అధ్యక్షతన పనిచేయటానికి ఆనందంగా ఉన్నామని చెప్పిన ఈటెల ఆయన అనుభవం పార్టీకి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణను గెలుచుకుంటామని ఆయన మరొకసారి నొప్పి వక్కాణించారు.

ఆ కంటెస్టెంట్ కు బాగా నోటిదురుసు.. నయని పావని షాకింగ్ కామెంట్స్ వైరల్!