కేసిఆర్ కు చెక్.. ఈటెల ప్లాన్ అదే !
TeluguStop.com
ఈసారి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్( CM Kcr ) రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కేసిఆర్ పోటీచేస్తున్న రెండు చోట్ల ఆయనను ఓడించాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.
అందులో భాగంగానే కేసిఆర్ కు పోటీగా గజ్వేల్ నుంచి బీజేపీ తరుపున ఈటెల రాజేందర్, అటు కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరుపున రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
కాగా కామారెడ్డి సంగతి అటుంచితే గజ్వేల్ లో కేసిఆర్ కు పోటీగా ఈటెల అనుసరిస్తున్న వ్యూహాలు ఎత్తుగడలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
గతంలో బిఆర్‌ఎస్ లో కీలక నేతగా వ్యవహరించిన ఈటెల రాజేందర్.ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీ గూటికి చేరారు.
బీజేపీలో కీలక నేతగా ఇప్పుడు పార్టీలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. """/" /
హుజూరాబాద్ లో ఈటెల( Etela Rajender ) కు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి కేసిఆర్ ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో గజ్వేల్ లో కూడా పోటీ చేస్తున్నారు.
అయితే కేసిఆర్ ను ఓడించడం అంతా తేలికైన విషయం కాదు.అందుకే ఈటెల రాజేందర్ సెంటిమెంట్ వ్యూహానికి తెర తీసినట్లు తెలుస్తోంది.
తాను ఎంతో నమ్మిన బిఆర్‌ఎస్ పార్టీ నుంచి గెంటేశారని, తాను ఏ తప్పు చేయకపోయిన మానసికంగా హింసించారని కేసిఆర్ ను నమ్మినందుకు వెన్నుపోటు పొడిచారని.
ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ నియోజికవర్గ ప్రజల్లో సానుభూతి పెరిగేలా ఈటెల వ్యవహరిస్తున్నారు.ఆ మద్య కేసిఆర్ పై కేటిఆర్ పై తీవ్రంగా మండిపడుతూ విమర్శలు గుప్పించిన ఈటెల ఇప్పుడు సడన్ గా సెంటిమెంట్ ను వల్లిస్తూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.
"""/" /
హుజూరాబాద్ లో కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ కావడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు ఈటెల రాజేందర్.
ఇప్పుడు గజ్వేల్ లో అదే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి కేసిఆర్ కు చెక్ పెట్టాలని ఈటెల ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే నియోజికవర్గంలోని చాలమంది బిఆర్‌ఎస్ కార్యకర్తలతో ఈటెల బృందం టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
వారంతా కూడా ఈటెల రాజేందర్ కె మద్దతు ఇచ్చేలా ఆయన చతురత ప్రదర్శిస్తున్నారట.
ఈసారి ఎలాగైనా కేసిఆర్ ను ఓడించాలని ఈటెయ రాజేందర్ ( Etela Rajender ) గట్టి పట్టుదల ప్రదర్శిస్తూ ఆ దిశగానే వ్యూహరచన చేస్తున్నారు.
మరి ఈటెల వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్‌లో దూరిన ప్రిన్సిపాల్.. చివరకు?