నోటీసులపై స్పందించిన ఈటల రాజేందర్..!!

తెలంగాణ పదవ తరగతి హిందీ పేపర్ లీక్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది.

ఈ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నీ A1 గా చేర్చడం మాత్రమే కాదు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది.

ఇదిలా ఉంటే ఇదే కేసులో బీజేపీ నేత ఈటెల రాజేందర్ పేరు కూడా మొదటి నుండి వినపడుతోంది.

ఈ క్రమంలో ఆయనకు రేపు విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులో ఫోన్ కూడా తీసుకురావాలని.స్పష్టం చేశారు.

అయితే తనకి వచ్చిన నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు.పోలీసుల నోటీసులపై లాయర్లతో చర్చిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యం మీద గౌరవంతో కచ్చితంగా రేపు విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.తనకి ఫోన్ వస్తే పచ్చ బట్టన్ నొక్కటం తప్ప.

వాట్సాప్ వాడటం రాదని చెప్పుకొచ్చారు.అటువంటప్పుడు ఎవరో పంపిన వాట్సాప్ మెసేజ్ నేను ఎలా ఓపెన్ చేస్తానని అన్నారు.

మరో పక్క కేసులో A2 గా ఉన్న ప్రశాంత్ .ఈటెల రాజేందర్ కి కూడా కాపీ పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో రేపు విచారణలో భాగంగా ఈటెల వాట్సాప్ చాట్ కీలకం కానుంది.

దీంతో రేపు ఈటెల ఫోన్ తీసుకొస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా ఉంది.

కాంగ్రెస్ బీఆర్ఎస్ దూకుడు… అయోమయంలో బీజేపీ ?