ఆ హార్మోన్ వ‌ల్లే మ‌హిళ‌ల‌కు క‌రోనా ముప్పు త‌క్కువ‌ట‌.. తెలుసా?

చైనాలో పురుడుపోసుకున్న క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎనిమిది ల‌క్ష‌ల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

కంటికి క‌నిపించ‌ని ఈ క‌రోనా భూతాన్ని అంతం చేసి మాన‌వుల‌ని ర‌క్షించేందుకు ప్ర‌పంచ‌దేశాల శాస్త‌వేత్త‌లు వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అయితే క‌రోనా వ‌చ్చి ఎనిమిది నెల‌లు గ‌డుస్తున్నా వ్యాక్సిన్ అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.రోజురోజుకు క‌రోనా కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.క‌రోనా ఉచ్చులో ప‌డుతున్న‌వారు.

చ‌నిపోతున్న‌వారిలో ఎక్కువ‌గా మ‌గ‌వారే ఉంటున్నారు.కరోనా బాధితుల్లో మహిళల సంఖ్య తక్కువగా ఉంటోంది.

ఎందుకిలా జ‌రుగుతుందో అమెరికాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు అధ్య‌య‌నం చేప‌ట్ట‌గా.

విస్తుపోయే విషయాలు బ‌య‌టపడ్డాయి.మహిళల్లో ఉత్పత్తి అయ్యే సెక్స్ హార్మోన్ `ఈస్ట్రోజన్` వల్ల క‌రోనా వ‌చ్చే ముప్పు త‌క్కువ‌గా ఉంటుంద‌ని వారు గుర్తించారు.

వాస్త‌వానికి కరోనా సోకితే గుండె మీద తీవ్ర ప్రభావం చూపితుంది.అయితే మ‌హిళ‌ల్లో క‌రోనా మ‌హ‌మ్మారి సోకినా.

వారిలో ఉండే ఈస్ట్రోజన్ వైర‌స్ ప్రభావం గుండె పై పడకుండా అడ్డుకుంటుంద‌ట‌.అదే స‌మ‌యంలో గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంద‌ట‌.

అందుకే క‌రోనా సోకినా మ‌హిళ‌ల్లో మ‌ర‌ణాలు కూడా త‌క్కువ‌గా సంభ‌విస్తున్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

రాజమౌళికి ఆ సినిమా అంత కష్టంగా అనిపించిందా.. ఐరన్ లెగ్ అన్నా పట్టించుకోరా?