తిరుమల నడకదారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు

తిరుమల నడక దారిలో చిరుత సంచారం నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అధికారులు అప్రమత్తమైన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా తిరుమల నడకదారిలో వైల్డ్ లైఫ్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ శాంతి ప్రియ పాండే తెలిపారు.

నడక దారిలో మరిన్ని లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు శాంతి ప్రియపాండే సూచించారు.

ప్రతి 20 మీటర్ల దూరంలో సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు.నిన్న నడక దారిలో పట్టుబడ్డ చిరుత డీఎన్ఏ కలెక్ట్ చేశామన్నారు.

ఈ క్రమంలో చిరుత మనిషిని తిన్నదా లేదా అన్న విషయాన్ని నిర్ధారిస్తామని తెలిపారు.

నమూనాలను ఐసర్ పరీక్షల కోసం పంపుతామన్నా శాంతిప్రియ పాండే తిరుమల నడక దారిలో కంచె ఏర్పాటు చేసినా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు.

తెలుగు వాళ్ళతోనే మాకు పోటీ అంటున్న తమిళ్ డైరెక్టర్స్…