“ఆపరేషన్ విముక్తి” పేరుతో డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు….

రానున్న 10 రోజుల్లో ప్రారంభించి సైకలజిస్ట్,సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్.రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla )పోలీస్ శాఖ ఆధ్వర్యంలో "ఆపరేషన్ విముక్తి" పేరుతో డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వారికి సైకలజిస్ట్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని, కౌన్సెలింగ్ కొరకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించి పెరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( Akhil Mahajan ) బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల కు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకొంటున్న వారికి దాని నుండి విముక్తి చేయాలనే ఒక మంచి ఉదేశ్యం తో జిల్లా పోలీస్ శాఖ( Police Department ) ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో డి-అడిక్షన్ సెంటర్ ను ఏర్పాటు చేసి నిపుణులు అయిన సైక్రియాటిస్ట్ లతో మత్తు పదార్థాలకు బానిసలుగా మారినటువంటి వారికి కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.

మాధకద్రవ్యాల కు అలవాటు పడి మనేయలేని స్థితిలో ఉన్న వారిని తల్లిదండ్రులు గుర్తించి తమ దగ్గరికి తీసుకువస్తే కౌన్సెలింగ్ నిర్వహించి మాధకద్రవ్యాల నుండి విముక్తి కలిపిస్తామని అన్నారు.

కౌన్సెలింగ్ కోసం తమ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో పేరు ను నమోదు చేసుకోవాలని ఎస్పీ కోరారు.

నోట్ * *డి-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కొరకు పెరు నమోదు, ఇతర సమాచారం కోసం స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ ఫోన్ నెంబర్ 8712656410, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఫోన్ నెంబర్ 8712656411 లను సంప్రదించండి.

పాలు, అంజీర్ క‌లిపి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?