ఏపీ లో టీఆర్ఎస్ ! జగన్ కోసమేనా ?

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలతోనే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.ఒకవైపు కాంగ్రెస్ , బీజేపీలు పుంజుకుంటూ  వస్తుండడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిణామాలు ఇబ్బంది కలిగిస్తాయి అన్న టెన్షన్ కెసిఆర్ లో నెలకొంది.

ఇక టిఆర్ఎస్ శ్రేణులు ఇదే రకమైన ఫీలింగ్ ఉండటంతో వారిని ఉత్సాహపరిచేందుకు పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్లీనరీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నో సంచలన విషయాలు చెప్పిన కేసీఆర్ ఏపీ విషయాలను ప్రస్తావించారు.

ఏపీకి టిఆర్ఎస్ పార్టీని విస్తరించాలని తనపై ఒత్తిడి వస్తుందని తమకు ఏపీలో అభిమానులు ఉన్నారని వారు చేస్తున్నారంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.

  అయితే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా లేక నిజంగానే పార్టీని ఏపీకి విస్తరించాలని చూస్తున్నారా అనేది సందేహం గాను, చర్చనీయాంశంగా మారింది.

వాస్తవంగా ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మంచి మిత్రులు.

రాజకీయంగానూ ఒకరికొకరు అన్ని విషయాలను సహకరించుకుంటూ వస్తున్నారు తెలంగాణ విభజన తరువాత అక్కడ పార్టీని జగన్ పట్టించుకోవడమే మానేశారు పార్టీ క్యాడర్ సైతం ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయింది అయితే ఇదంతా జగన్ వ్యూహాత్మకంగానే చేశారని, టిఆర్ఎస్ కు మేలు కలిగే విధంగా వ్యవహరించారు అనేది బహిరంగ రహస్యం.

దానికి పరోపకారం గాని 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు సహాయం కెసిఆర్ నుంచి అందింది.

"""/"/ దీనికి కారణం జగన్ పై ఉన్న అభిమానంతో పాటు, టిడిపి అధినేత చంద్రబాబు పై ఉన్న కోపము కారణమే.

ఇక ప్రస్తుత సందర్భానికి వస్తే ఏపీలో రైతు బందు పథకాన్ని అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని దానికోసమే టిఆర్ఎస్ పార్టీ పెడితే తాము గెలిపించుకుంటామని ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

అయితే ఏపీలో ప్రతిపక్షాలు రోజు రోజుకీ బలం పుంజుకుంటూ ఉండడం జగన్ కు ఇబ్బందికరంగా మారడం తదితర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ను ఏపీకి విస్తరించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ టీడీపీ కి బలంగా మారకుండా ఈ ఎత్తుగడ వేసినట్టుగా అర్థం అవుతోంది.

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేసిన దిల్ రాజు, విజయ్ దేవరకొండ?