పరారీలో మైనింగ్ కింగ్ 'గాలి'

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.బుధవారం (నవంబర్ 7) ఉదయం జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.

అప్పటికే ఆయన పారిపోయినట్లు తెలిసింది.సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించిన బెంగళూరు సీసీబీ పోలీసులు ఆయన కోసం గాలిస్తూ నగరానికి చేరుకున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన కేసు విషయంలో ఈడీ అధికారికి గాలి జనార్దన్ రెడ్డి రూ.

కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.ఈ విషయంలో ఆయణ్ని అదుపులోకి తీసుకొని విచారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే.అంతలోనే వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు.