ఎల్లారెడ్డి పేట రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని ఎర్రగడ్డ తండా ప్రజల ఏకగ్రీవ తీర్మానం
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావు పేట ముస్తాబాద్ నాలుగు మండలాలను కలిపి రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కోరుతూ వీర్నపల్లి మండలంలోని ఎర్రగడ్డ తండా ప్రజలు తీర్మానం కాపీని రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ కు అందజేశారు.
బాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి( Vinayaka Chavithi ) పర్వదినం సందర్భంగా వీర్నపల్లి లోని దాసాంజనేయ స్వామి ఆలయం లో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి రెండు మండలాల రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు సామూహికంగా పూజలు నిర్వహించారు.
గ్రామగ్రామాన రెవెన్యూ డివిజన్( Revenue Division ) సాధన వల్ల జరిగే లాభాలను ఎర్రగడ్డ ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ నేటి నుండి నాలుగు మండలాలలో ప్రతి గ్రామగ్రామాన రెవెన్యూ డివిజన్ విశిష్టత ను ప్రజలందరికీ వివరిస్తామని బాలరాజు యాదవ్ వివరించారు.
రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట మాందాటి లక్ష్మణ్ యాదవ్, వీర్నపల్లి రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ పీరు నాయక్, పరుమాల మల్లేష్ యాదవ్,జోగుల కాంతయ్య, రాకేష్,శ్రీనివాస్ లతో పాటు ఎర్రగడ్డ తండా ప్రజలు పాల్గొన్నారు.
వెయిట్ లాస్ కు తోడ్పడే బెస్ట్ స్మూతీ ఇది.. వారానికి 2 సార్లు తీసుకున్న మస్తు లాభాలు!