ఎరిక్ లెజ్‌మెన్‌ అనుమానాస్పద స్థితిలో మరణించారు

లాస్‌ఏంజెల్స్ సిటీ డిప్యూటీ అటార్నీ జనరల్ ఎరిక్ లెజ్‌మెన్‌ కుటుంబసభ్యులు అనుమానాస్పద స్థితిలో మరణించారు.

వివరాల్లోకి వెళితే.బుధవారం సాయంత్రం నార్త్‌రిడ్జ్ సబర్బ్ ప్రాంతంలోని ఎరిక్ నివాసంలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధం వినిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎరిక్ ఆయన భార్య, కుమారుడి మృతదేహాలు గదిలో పడివుండటాన్ని గుర్తించారు.

"""/"/  ఘటనా స్థలి నుంచి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.అయితే డిప్యూటీ అటార్నీ ఎరిక్ తన కుటుంబసభ్యులను కాల్చి చంపిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఎరిక్ తన కుమార్తెను కాల్చి చంపేందుకు ప్రయత్నించినప్పటికీ.ఆమె ఎలాగోలా తప్పించుకుని తమకు విషయం చెప్పిందని స్థానికులు చెబుతున్నారు.

మరోవైపు ఎరిక్ మరణం పట్ల లాస్‌ఏంజెల్స్ అటార్నీ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఎరిక్ తనతో పాటు 2005 నుంచి పనిచేస్తున్నారని.ఇది ఒక విషాదకర ఘటనగా ఆయన అభివర్ణించారు.

ఇది ఆత్మహత్యా లేక ఏదైనా కుట్రకోణం ఉందా అన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable